OTT Movies: ఓటీటీలో 21 సినిమాలు.. స్పెషల్‌గా 9, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వాలంటైన్స్ వారంలో 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 9 స్పెషల్‌గా ఉంటే.. 4 మాత్రం తెలుగులో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, సోనీ లివ్, హోయ్‌చోయ్, లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈవారం (ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు) అంటే వాలంటైన్స్ వీక్‌లో 21 సినిమాల దాకా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవి హారర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, రొమాంటిక్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్ వార్ బేస్‌డ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ చిత్రం)- ఫిబ్రవరి 11
ది విచర్: సైరెన్స్ ఆఫ్ ది డీప్ ( ఇంగ్లీష్ అడల్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
డెత్ బిఫోర్ ది వెడ్డింగ్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 12
ది ఎక్స్‌చేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 13
లా డోల్సీ విల్లా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 13
ధూమ్ ధామ్ (హిందీ కామెడీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 14
మెలో మూవీ (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 14
ఐయామ్ మ్యారీడ్.. బట్! (కొరియన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్- ఫిబ్రవరి 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 14
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
ఒరి కాట్టిల్ ఒరి మురి (మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 10
మనోరాజ్యం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి- ఫిబ్రవరి 14
బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ (హిందీ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 11
సమ్మేళనం (తెలుగు సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 13
మై ఫాల్ట్: లండన్ (బ్రిటీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఫిబ్రవరి 13
బిషోహోరి (బెంగాలి సూపర్ నాచురల్ హారర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 13
డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (తెలుగు రియాలిటీ డ్యాన్స్ షో)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 14
ప్యార్ టెస్టింగ్ (హిందీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 14
మార్కో (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 14
సబ్‌సర్వియన్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 14
ఓటీటీలో 21 స్ట్రీమింగ్
ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 20 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో, రొమాంటిక్ మూవీ కాదలిక్క నేరమిల్లై, తెలుగు మూవీ సమ్మేళనం, ఫరియా అబ్ధుల్లా జడ్జ్‌గా చేయనున్న డ్యాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ 2 స్పెషల్‌గా ఉన్నాయి.
9 స్పెషల్- తెలుగులో 4
వీటితోపాటు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ బిషోహోరి, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సబ్‌సర్వియన్స్, కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధూమ్ ధామ్, రొమాంటిక్ కామెడీ సినిమాలు ప్యార్ టెస్టింగ్, బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 20లో 6 సినిమాలు, ఒక వెబ్ సిరీస్, ఒక రియాలిటీ షోతో మొత్తంగా 9 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో నాలుగు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
సంబంధిత కథనం