OTT Movies: ఓటీటీలో 17 సినిమాలు- 10 స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి బోల్డ్ వరకు!-ott movies this week telugu balakrishna daaku maharaaj keerthy suresh baby john oops ab kya crime beat netflix prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 17 సినిమాలు- 10 స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి బోల్డ్ వరకు!

OTT Movies: ఓటీటీలో 17 సినిమాలు- 10 స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి బోల్డ్ వరకు!

Sanjiv Kumar HT Telugu
Published Feb 18, 2025 11:54 AM IST

OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 17 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 10 స్పెషల్‌గా ఉంటే 6 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇందులోనూ బాలకృష్ణ డాకు మహారాజ్, కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాలతోపాటు బోల్డ్, క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఉన్నాయి.

ఈ వారం ఓటీటీ సినిమాలు
ఈ వారం ఓటీటీ సినిమాలు

OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే ఫిబ్రవరి 17 నుంచి 23 వరకు 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బోల్డ్, మర్డర్ ఇన్వేస్టిగేటివ్, కామెడీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అమెరికన్ మర్డర్ గాబీ పెటిటో (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 17

కోర్ట్ ఆఫ్ గోల్డ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 18

ఆఫ్‌లైన్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- ఫిబ్రవరి 18

జీరో డే (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ది వైట్ లోటస్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 17

ది వైల్డ్ రోబోట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ మూవీ)- ఫిబ్రవరి 18

విన్ ఆర్ లూజ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 19

ఊప్స్! అబ్ క్యా? (హిందీ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

ఆఫీస్ (తమిళ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బేబీ జాన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20

రీచర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

సమ్మేళనం (తెలుగు రొమాంటిక్ సినిమా)- ఫిబ్రవరి 20

బాటిల్ రాధ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ సినిమా)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 21 (రూమర్ డేట్)

క్రైమ్ బీట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 21

సర్ఫేస్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఫిబ్రవరి 21

చాల్‌చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్ (బెంగాలీ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 21

17 ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఓటీటీలోకి ఈ వారం 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, సమ్మేళనం చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అలాగే, తెలుగు డబ్బింగ్ డ్రామా సిరీస్ ది వైట్ లోటస్ సీజన్ 3, యానిమేట్ చిత్రం ది వైల్డ్ రోబోట్, ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ రీచర్ సీజన్ 3, తమిళ కామెడీ సినిమా బాటిల్ రాధ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

తెలుగు ఓటీటీ రిలీజ్ సినిమాలు

వీటితోపాటు కీర్తి సురేష్ యాక్షన్ థ్రిల్లర్ బేబీ జాన్ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ క్రైమ్ బీట్, బోల్డ్ సిరీస్ ఊప్స్ అబ్ క్యా, మర్డర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం చాల్‌చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్ కూడా స్పెషల్ కానున్నాయి. ఇలా 15లో 6 సినిమాలు, 4 వెబ్ సిరీస్‌లతో 10 స్పెషల్‌గా ఉంటే ఇందులో 6 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం