OTT Movies: ఓటీటీల్లో ఈ వారం టాప్-5 రిలీజ్‍లు ఇవి.. డిఫరెంట్ జానర్లలో చిత్రాలు
OTT Movies this week: ఈ వారం ఓటీటీల్లో ఐదు రిలీజ్‍లు ఆసక్తికరంగా ఉన్నాయి. వివిధ జానర్లలో ఉన్న చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍పై కూడా ఇంట్రెస్ట్ నెలకొంది.

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం (ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 22) మరిన్ని సినిమాలు, సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఆసక్తిని రేపుతున్నాయి. చాలా మంది ఎదురుచూస్తున్న డాకు మహరాజ్ చిత్రం ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ మలయాళ బ్లాక్‍బస్టర్ తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. ఓ ఆసక్తికర వెబ్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో ఐదు టాప్ రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
డాకు మహరాజ్
డాకు మహరాజ్ చిత్రం ఈ శుక్రవారమే (ఫిబ్రవరి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన డాకు మహరాజ్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. సుమారు 40 రోజులకు ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు .
క్రైమ్ బీట్
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో షకీబ్ సలీమ్ లీడ్ రోల్ పోషించారు. సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి నిజాలను వెలికి తీసేందుకు ఓ క్రైమ్ జర్నలిస్టు ప్రయత్నించడం చుట్టూ క్రైమ్ బీట్ సిరీస్ సాగుతుంది. సబా ఆజాద్, రాహుల్ భట్, రాజేశ్ తైలంగ్, సాయి తంహనకర్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
సమ్మేళనం
సమ్మేళనం సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 20వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంలో గానాదిత్య, ప్రియా వడ్లమాని, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రలు పోషించారు. సమ్మేళనం చిత్రానికి తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించారు.
మార్కో
మలయాళ బ్లాక్‍బస్టర్ చిత్రం ‘మార్కో’ సోనీ లివ్ ఓటీటీలో గత వారమే వచ్చింది. అయితే, తెలుగులో ఆహా ఓటీటీలోనూ ఈ వారం స్ట్రీమింగ్‍కు రానుంది. ఫిబ్రవరి 21న మార్కో తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రం సోనీ లివ్‍లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో అందుబాటులో ఉంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో చిత్రం రూ.150కోట్లకు పైగా వసూళ్లతో భారీ బ్లాక్‍బస్టర్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు హనీఫ్ అదేనీ.
బేబీ జాన్
బేబీ జాన్ చిత్రం ఈ వారమే ఫిబ్రవరి 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఫిబ్రవరి 20న రెంట్ తొలగిపోయి సాధారణ స్ట్రీమింగ్‍కు ప్రైమ్ వీడియోలో ఉండనుంది. బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గతేడాది డిసెంబర్లో రిలీజై ప్లాఫ్ అయింది. బేబీ జాన్ మూవీకి కలీస్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం
టాపిక్