OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో మూడు.. విభిన్నమైన జానర్లతో..-ott movies releases this week harom hara aadujeevitham hotspot ott netflix aha etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో మూడు.. విభిన్నమైన జానర్లతో..

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో మూడు.. విభిన్నమైన జానర్లతో..

OTT Telugu Movies: ఓటీటీలో ఈ వారం తెలుగులో మొత్తంగా ఐదు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. మరో మూడు తెలుగు డబ్బింగ్‍లో అడుగుపెట్టాయి.

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు.. డబ్బింగ్‍లో మరో మూడు.. విభిన్నమైన జానర్లతో..

ఈ వారం ఓటీటీల్లో తెలుగులో వివిధ జానర్లతో సినిమాలు వచ్చాయి. ఓటీటీలతో ఈ వీకెండ్ టైంపాస్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్‌ హరోం హర చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రాగా.. స్ఫూర్తి కలిగించే ఎమోషనల్ డ్రామా మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అడుగుపెట్టింది. ఈ రెండు స్ట్రైట్ తెలుగు చిత్రాలతో పాటు మూడు ఇతర భాషల చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో ఈ వారం ఓటీటీల్లోకి వచ్చాయి. మలయాళం సర్వైవల్ డ్రామా ఆడుజీవితం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు ఏవంటే..

మ్యూజిక్‍షాప్ మూర్తి - కామెడీ, ఎమోషన్

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఎమోషనల్ డ్రామాగా వచ్చింది. ఐదు పదుల వయసు ఉన్న మూర్తి.. డీజే అవ్వాలని కృషి చేసే అంశంతో ఈ మూవీ వచ్చింది. స్ఫూర్తిదాయకంగా ఉందంటూ ఈ చిత్రంపై ప్రశంసలు వచ్చాయి. శిల పాలడుగు దర్శకత్వం వహించిన మ్యూజిక్‍షాప్ మూర్తి మూవీలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరి మెయిన్ రోల్స్ చేశారు. జూన్ 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఈ మంగళవారమే (జూలై 16) ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత జూలై 17న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఆడుజీవితం - సర్వైవల్ డ్రామా

సర్వైవల్ డ్రామాగా వచ్చిన మలయాళం మూవీ ఆడుజీవితం (ది గోట్‍లైఫ్) సూపర్ హిట్ అయింది. ఉపాధి కోసం సౌదీకి వెళ్లి ఎడారిలో కష్టాలు పడిన నజీబ్ అనే వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నజీబ్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కాగా.. రూ.150కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఆడుజీవితం చిత్రం ఈ శుక్రవారం (జూలై 29) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్‍లో కూడా స్ట్రీమింగ్‍ అవుతోంది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

హాట్‍స్పాట్ - ఆంథాలజీ మూవీ

తమిళ మూవీ హాట్‍స్పాట్ తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులో వచ్చింది. నాలుగు కథలతో ఆంథాలజీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 29న తమిళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. న్యూఏజ్ స్టోరీలతో చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్. గౌరీ జీ.కిషన్, ఆదిత్య భాస్కర్, శాడీ, అమ్ము అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా మెయిన్ రోల్స్ చేశారు. హాట్‍స్పాట్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో ఈ బుధవారం (జూలై 17) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

బూమర్ అంకుల్ - కామెడీ మూవీ

తమిళ సినిమా బూమర్ అంకుల్ తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. నేడే (జూలై 20) ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని ఆమె పెట్టిన ఓ రూల్‍కు అంగీకరించిన భర్త చిక్కుల్లో పడడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు స్వదేశ్ ఎంఎస్. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్ర పోషించారు. మార్చిలో తమిళంలో థియేటర్లలో రిలీజైన బూమర్ అంకుల్ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

హరోం హర - యాక్షన్ డ్రామా మూవీ

హరోం హర సినిమా జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించగా.. సుధీర్ బాబు హీరోగా నటించారు. ఈ మూవీ 1980ల బ్యాక్‍డ్రాప్‍లో చిత్తూరు ప్రాంతంలో సాగుతుంది. రౌడీల వల్ల ఉద్యోగం కోల్పోయే యువకుడు.. తుపాకులను అక్రమంగా తయారు చేసి.. గ్యాంగ్‍స్టర్‌గా ఎదగడం చుట్టూ హరోం హర చిత్రం సాగుతుంది. ఈ మూవీ ఆహా ఓటీటీలోకి ఈ సోమవారం (జూలై 15) స్ట్రీమింగ్‍కు రాగా.. ఆ తర్వాత రోజే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా అందుబాటులోకి వచ్చింది.