OTT Movies: ఓటీటీలో ఒక్కరోజే సినీ పండుగ.. ఏకంగా 11 రిలీజ్.. ఈ 5 మాత్రం చూడాల్సిందే!
OTT Movies Releases Friday: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాల వరకు విడుదల కాగా ఒక్క శుక్రవారం (జూన్ 13) నాడు ఏకంగా 11 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీసులతోపాటు యాక్షన్ మూవీస్ ఉన్నాయి. మరి అవి ఏ ఓటీటీలో ఉన్నాయో లుక్కేద్దాం.

Today OTT Releases: ఏ వారానికి ఆ వారం స్పెషల్ అన్నట్లుగా ఎప్పుడూ సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇస్తుంటాయి. అదివరకు విడుదలైన సినిమాలు చూడటం కాకముందే కుప్పలుతెప్పలుగా సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీలు ఎంట్రీ ఇచ్చి ఊరిస్తుంటాయి. ప్రతి వారం ఓటీటీలో సినిమాల జాతర జరుగుతూనే ఉంటుంది.
ఓటీటీ రిలీజ్
అయితే, ఈ ఓటీటీ సినీ జాతరలో ముఖ్యమైన రోజు శుక్రవారం. ఈ రోజున ఎక్కువగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ ఫ్రైడే అంటే జూన్ 13న (Friday OTT Release) సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 11 వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అబంగ్ అధిక్ (మాండరిన్ మూవీ)- జూన్ 14
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా)- జూన్ 14
జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేషియన్ వెబ్ సిరీస్)- జూన్ 14
మహారాజ్ (హిందీ చిత్రం)- జూన్ 14
ఆహా ఓటీటీ
డియర్ నాన్న (తెలుగు సినిమా)- జూన్ 14
కురంగు పెడల్ (తమిళ వెబ్ సిరీస్)- జూన్ 14
జీ5 ఓటీటీ
లవ్ కీ అరెంజ్ మ్యారేజ్ (హిందీ చిత్రం)- జూన్ 14
పరువు (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14
యక్షిణి (తెలుగు వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 14
క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- జూన్ 14
ఫాల్ గాయ్ (హాలీవుడ్ చిత్రం)- బుక్ షో షో ఓటీటీ- జూన్ 14
2 వెబ్ సిరీసులు
ఇలా ఫ్రైడే రోజున మూవీస్, వెబ్ సిరీసులు కలిపి 11 విడుదల అయ్యాయి. వీటిలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన యక్షిణి (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ), మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పరువు (జీ5 ఓటీటీ) వెబ్ సిరీసులు చాలా స్పెషల్ కానున్నాయి. అలాగే విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎందుకంటే థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది గ్యాంగ్స్ అఫ్ గోదావరి.
తండ్రీ కొడుకుల ఎమోషన్
అంజలి, నేహా శెట్టి హీరోయిన్స్‌గా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు ఫాదర్స్ డే సందర్భంగా చూసేందుక తండ్రీ కొడుకుల ఎమోషన్ చెప్పే డియర్ నాన్న (ఆహా ఓటీటీ), హిందీ మూవీ మహారాజ్ (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ) కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ఇలా రెండు వెబ్ సిరీసులు మూడు సినిమాలతో మొత్తం 5 ఈ ఫ్రైడే స్పెషల్ మూవీస్. కాగా జూన్ 14 అంటే ఇవాళ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం.
ఇవే కాకుండా
ఇవే కాకుండా ఈ వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చిన పారిజాత పర్వం సినిమా, ది బాయ్స్ సీజన్ 4, తెలుగు మూవీ గ్రౌండ్ స్పెషలే. పారిజాత పర్వం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంటే, ది బాయ్స్ సీజన్ 4, గ్రౌండ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.