OTT November Movies: నవంబర్‌లో ఓటీటీల్లోకి వచ్చే 5 ముఖ్యమైన సినిమాలు.. సమంత సిరీస్ కూడా.. దేవర, వేట్టయన్ సహా మరిన్ని..
OTT November Movies: నవంబర్ నెలలో కొన్ని పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేయనున్నాయి. దేవర సహా మరిన్ని సినిమాలు అడుగుపెట్టనున్నాయి. సమంత నటించిన ఓ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. నవంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
నవంబర్ నెల మరో మూడు రోజుల్లో వచ్చేస్తోంది. ఆ నెలలోనూ ఓటీటీల్లోకి చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన రిలీజ్‍లు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, రజినీకాంత్ ‘వేట్టయన్’ ఉన్నాయి. మరిన్ని చిత్రాలు రానున్నాయి. హీరోయిన్ సమంత లీడ్ రోల్ చేసిన ఓ భారీ సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. నవంబర్ నెలలో ఓటీటీల్లోకి రానున్న ముఖ్యమైన చిత్రాలు, ఓ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం నవంబర్ నెలలో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 8వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ దేవర సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైంది. రూ.500కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ కొట్టింది.
వేట్టయన్
తమళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ హీరోగా చేసిన వేట్టయన్ చిత్రం కూడా నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. నవంబర్ 7న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. వేట్టయన్ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలోకి రాగా.. అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు రాలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయన్‍లో అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, ఫాహద్ ఫాజిల్ కూడా కీలకపాత్రలు పోషించారు.
మా నాన్న సూపర్ హీరో
మా నాన్న సూపర్ హీరో చిత్రం నవంబర్‌లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది. నవంబర్ తొలి వారంలోనే ఈ మూవీ జీ5 వస్తుందని తెలుస్తోంది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించారు. షాయాజీ షిండే కూడా లీజ్ రోల్ చేశారు.
కిష్కింద కాండం
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం నవంబర్ తొలి వారంలోనే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానున్నట్టు అంచనాలు ఉన్నాయి. దినిజిత్ అయ్యతన్ దర్శకత్వంలో ఆసిఫ్ అలీ, విజయ రాఘవన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 12 థియేయర్లలో రిలీజై సూపర్ హిట్ కొట్టింది.
జనక అయితే గనక
సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ చిత్రం అక్టోబర్ చివరి వారం లేకపోతే నవంబర్ తొలి వారం ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. దీంతో త్వరలో ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా జనక అయితే గనక అక్టోబర్ 12న థియేటర్లలో రిలీజైంది.
సిటాడెల్: హనీ బన్నీ
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ స్పై యాక్షన్ సిరీస్‍కు రాజ్&డీకే దర్శకత్వం వహించారు. అమెరికన్ సిరీస్ సిటాడెల్‍కు ఇండియన్ వెర్షన్‍గా ఈ హనీబన్నీ వస్తోంది.