New OTT Movies: ఓటీటీలో కొత్తగా 18 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్లలో!-ott movies release this week netflix zee5 amazon prime aha bloody isshq ott raju yadav ott streaming bhaiya ji ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New Ott Movies: ఓటీటీలో కొత్తగా 18 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్లలో!

New OTT Movies: ఓటీటీలో కొత్తగా 18 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్లలో!

Sanjiv Kumar HT Telugu
Updated Jul 24, 2024 02:57 PM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలుపుకుని ఏకంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా నాలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ కచ్చితంగా చూడాల్సినవిగా ఉన్నాయి. అందులో హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్స్ ఉన్నాయి.

ఓటీటీలో కొత్తగా 18 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్లలో!
ఓటీటీలో కొత్తగా 18 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. హారర్, కామెడీ, ఫాంటసీ జోనర్లలో!

This Week OTT Movies: థియేటర్లలో మెల్లి మెల్లిగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల హడావిడి తగ్గుతోంది. ఇక తెలుగు చిన్న సినిమాలతోపాటు ఇతర భాషా చిత్రాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఈ వారం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాయన్‌తోపాటు రాజ్ తరుణ్ పురుషోత్తముడు, ఆపరేషన్ రావణ్ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఓటీటీల్లో 18 సినిమాలు

అయితే, వీటిలో దేనికి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ, ధనుష్ రాయన్‌పై కాస్తా అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కన పెడితే ఓటీటీలో మాత్రం అలరించేందుకు చాలా సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ వారం అంటే (జూలై 15 నుంచి జూలై 21 వరకు) ఓటీటీల్లో 18 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటీ, ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది డెకమెరన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 25

క్లియో సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- జూలై 25

టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 25

ఘోస్ట్ బస్టర్స్: ఫ్రొజెన్ ఎంపైర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 26

ది డ్రాగెన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26

ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26

జీ5 ఓటీటీ

భయ్యాజీ (హిందీ చిత్రం)- జూలై 26

ఛల్తే రహే జిందగీ (హిందీ సినిమా)- జూలై 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

బ్లడీ ఇష్క్ (హిందీ సినిమా)- జూలై 26

చట్నీ సాంబర్ (తమిళ వెబ్ సిరీస్)- జూలై 26

ఆహా ఓటీటీ

గ్రాండ్ మా (తమిళ మూవీ)- జూలై 23

కాళ్ (తమిళ చిత్రం)- జూలై 23

రాజు యాదవ్ (తెలుగు సినిమా)- జూలై 24

భరతనాట్యం (తెలుగు చిత్రం)- జూలై 27

టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 24

వన్ లైఫ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 25

ది మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మెన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 25

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ సినిమా)- జియో సినిమా ఓటీటీ- జూలై 26

హారర్ - కామెడీ

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 18 ఓటీటీలోకి రాగా ఈపాటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో అవికా గోర్ తెలుగు హారర్ మూవీ బ్లడీ ఇష్క్, గెటప్ శ్రీను కామెడీ చిత్రం రాజు యాదవ్, తెలుగు సినిమా భరతనాట్యం, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన హిందీ మూవీ భయ్యా జీ సినిమాలు స్పెషల్ కానున్నాయి.

తమిళ వెబ్ సిరీస్

వీటితోపాటు తమిళ పాపులర్ కమెడియన్ యోగి బాబు మెయిన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన కోలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్ చట్నీ సాంబార్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. అలాగే హాలీవుడ్ కామెడీ ఫాంటసీ సినిమా ఘోస్ట్ బస్టర్స్: ఫ్రొజెన్ ఎంపైర్ సైతం ప్రత్యేకం కానుంది. ఇలా ఐదు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

Whats_app_banner