OTT Movies: మూడ్రోజుల్లో ఓటీటీల్లోకి ది బెస్ట్ 8 సినిమాలు.. తెలుగులో 7.. కచ్చితంగా చూడాల్సినవి 3.. ఎందుకంటే?
OTT Movies Release Telugu In 3 Days: ఓటీటీల్లోకి ఈ మూడ్రోజుల్లో బెస్ట్ అనిపించే 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగు భాషలో 7 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్న ఈ సినిమాల్లో కచ్చితంగా చూడాల్సినవి 3 ఉన్నాయి.
OTT Release Movies Telugu: ఓటీటీలో ఈ వారం ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో గత మూడు రోజుల్లో ది బెస్ట్ 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 7 సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, అందులో మూడు మాత్రమే కచ్చితంగా చూసే వాచబుల్ సినిమాలుగా సజెషన్ పరంగా తెలియజేస్తున్నాం. మరి అవేంటో ఓ లుక్కేయండి.
సూక్షదర్శిని ఓటీటీ
మలయాళంలో డార్క్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సూక్షదర్శిని సినిమా మంచి విజయం సాధించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో జనవరి 11 నుంచి సూక్షదర్శిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 8.1 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ సినిమాను కచ్చితంగా చూసేయొచ్చు.
మిస్ యూ ఓటీటీ
హీరో సిద్ధార్థ్, నా సామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ తొలిసారి జోడీ కట్టిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మిస్ యూ. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో రెంటల్ విధానంలో జనవరి 10 నుంచి మిస్ యూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ లవ్ స్టోరీగా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు.
బచ్చల మల్లి ఓటీటీ
అల్లరి నరేష్ మరోసారి సీరియస్ రోల్‌లో నటించిన బచ్చల మల్లి 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఈటీవీ విన్ ఓటీటీల్లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
హైడ్ అండ్ సీక్ ఓటీటీ
విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్. జనవరి 10న ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన హైడ్ అండ్ సీక్ ఐఎండీబీడీ నుంచి 9.1 రేటింగ్ తెచ్చుకుంది. కాబట్టి, ఈ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.
సీక్రెట్ ఓటీటీ
ట్విస్టులతో సాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సీక్రెట్. ఐఎండీబీ నుంచి 8.4 రేటింగ్ తెచ్చుకున్న సీక్రెట్ మూవీ జనవరి 10 సన్ ఎన్ఎక్స్‌టీ, మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మలయాళం భాషలోనే ఉన్న ఈ సినిమాను చూడటం తెలుగు ఆడియెన్స్‌కు కష్టమని చెప్పొచ్చు.
ప్రేమించొద్దు ఓటీటీ
తెలుగులో రొమాంటిక్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ప్రేమించొద్దు. జనవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్, బీసినీట్ (Bcineet OTT) రెండు ఓటీటీల్లో ప్రేమించొద్దు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
వీ 2 డబుల్ మర్డర్
ఓటీటీలో కాకుండా యూట్యూబ్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌కు మలయాళ సినిమా కురుక్కు. తెలుగులో వీ 2 డబుల్ మర్డర్ టైటిల్‌తో ప్రసారం అవుతోన్న ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఎంచక్కా ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
బ్రేక్ అవుట్ ఓటీటీ
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ బ్రేక్ అవుట్. జనవరి 9 నుంచి ఈటీవీ విన్‌లో బ్రేక్ అవుట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా మూడ్రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 8లో 7 తెలుగులో రిలీజ్ కాగా చూసేందుకు 3 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
సంబంధిత కథనం