OTT Movies: ఓటీటీల్లో బీటీఎస్‌కు బాగా నచ్చిన సినిమాలు ఇవే.. మీరు చూశారా?-ott movies korean band bts members jimin jin jungkook suga recommended movies on otts prime video netflix hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీల్లో బీటీఎస్‌కు బాగా నచ్చిన సినిమాలు ఇవే.. మీరు చూశారా?

OTT Movies: ఓటీటీల్లో బీటీఎస్‌కు బాగా నచ్చిన సినిమాలు ఇవే.. మీరు చూశారా?

Hari Prasad S HT Telugu
Published Apr 15, 2024 09:13 AM IST

OTT Movies: కొరియన్ బ్యాండ్ బీటీఎస్ అంటే వరల్డ్ ఫేమస్. మరి ఈ గ్రూపులోని ఏడుగురు స్టార్లకు బాగా నచ్చిన సినిమాలు ఏవి? అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఒకసారి చూడండి.

ఓటీటీల్లో బీటీఎస్‌కు బాగా నచ్చిన సినిమాలు ఇవే.. మీరు చూశారా?
ఓటీటీల్లో బీటీఎస్‌కు బాగా నచ్చిన సినిమాలు ఇవే.. మీరు చూశారా?

OTT Movies: సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాళ్ల మ్యూజిక్ అంటే ప్రాణమిస్తారు. మరి ఆ బ్యాండ్ లోని మెంబర్స్ కు బాగా నచ్చిన సినిమాలు ఏవో తెలుసా? ప్రస్తుతం ఈ మ్యూజిక్ గ్రూప్ లోని మెంబర్స్ కొరియన్ ఆర్మీలో సేవలందిస్తున్నారు. అయితే గతంలో ఎన్నోసార్లు వీళ్లు సినిమాల గురించి మాట్లాడారు. మరి వాళ్ల ఫేవరెట్ మూవీస్ ఏంటి? వాటిని ఏ ఓటీటీల్లో చూడొచ్చు?

బీటీఎస్ బ్యాండ్ ఫేవరెట్ మూవీస్ ఇవే

లా లా ల్యాండ్ - ప్రైమ్ వీడియో

ఆస్కార్ విన్నింగ్ నటి ఎమ్మా స్టోన్ నటించిన మూవీ లా లా ల్యాండ్. ఇదొక మ్యూజికల్ రొమాన్స్ మూవీ. తమ కెరీర్లలో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రేమలో పడిన ఇద్దరు ఆర్టిస్టుల చుట్టూ తిరిగే కథ ఇది. ఇది బీటీఎస్ బ్యాండ్ లోని జిమిన్ కు ఫేవరెట్ మూవీ కావడం విశేషం. లా లా ల్యాండ్ ను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ది మ్యాట్రిక్స్ - నెట్‌ఫ్లిక్స్

సై-ఫి మూవీ ది మ్యాట్రిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 1999లో వచ్చిన ఈ మూవీలో కీను రీవ్స్, లారెన్స్ ఫిష్‌బర్న్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను బీటీఎస్ మెంబర్ జిన్ రికమెంట్ చేస్తున్నాడు. ది మ్యాట్రిక్స్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్ - ప్రైమ్ వీడియో

ఇదొక సై-ఫి రొమాన్స్ డ్రామా మూవీ. ఇద్దరు ప్రేమికుల బ్రేకప్ తర్వాత ఒకరి జ్ఞాపకాలను మరొకరు తమ మెదళ్ల నుంచి తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. జిమ్ క్యారీ, కేట్ విన్‌స్లెట్ నటించిన ఈ సినిమా 2004లో వచ్చింది. బీటీఎస్ గ్రూప్ మెంబర్ ఆర్ఎం ఈ మూవీ రికమెండ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

కొకొ -డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

కొకొ ఓ యానిమేషన్ మూవీ. మిగెల్ అనే ఓ యానిమేటెడ్ పాత్ర తన మ్యూజిక్ కలను నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. ఈ సినిమాను సుగా రికమెండ్ చేశాడు.

ది నోట్‌బుక్ - ప్రైమ్ వీడియో

ది నోట్‌బుక్ ఓ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో రియాన్ గోస్లింగ్, రేచెల్ మెక్ఆడమ్స్ నటించారు. జిమిన్ రికమెండ్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ది సోషల్ డైలమా - నెట్‌ఫ్లిక్స్

ది సోషల్ డైలమా అనేది సోషల్ మీడియా ద్వారా ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని కళ్లకు కట్టిన ఓ డాక్యుమెంటరీ డ్రామా. దీనిని బీటీఎస్ సభ్యుడు ఆర్ఎం రికమెండ్ చేశాడు.

లవ్ 911 - ప్రైమ్ వీడియో

బీటీఎస్ సభ్యుడు జంగ్‌కూక్ కు బాగా నచ్చిన మూవీ ఇది. ఇదొక కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఓ డాక్టర్, భర్తను కోల్పోయిన ఓ ఫైర్ ఫైటర్ కు మధ్య జరిగిన లవ్ స్టోరీయే ఈ మూవీ. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

Whats_app_banner