OTT Movies With Family: ఓటీటీల హవా పెరిగిపోతుండటంతో ప్రతివారం కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటిలో ఎన్నో రకాల జోనర్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేస్తున్నాయి. హారర్, థ్రిల్లర్, స్కై ఫై, పాంటసీ, క్రైమ్, కామెడీ ఇలా పలు రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తున్న అన్నింటిన కుటుంబంతో కలిసి హాయిగా చూడలేం. ఫ్యామిలీతో కలిసి ఓటీటీ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ వారం విడుదలై.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ ఓటీటీ సినిమాలు బెస్ట్ ఆప్షన్.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సినిమా 'గుంటూరు కారం' ఎట్టకేలకు ఈ వారం నెట్ ఫ్లిక్స్‌కు వచ్చింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో గుంటూరుకు చెందిన రమణ అనే రౌడీ తన తల్లికి దూరంగా ఉంటాడు. ఇందులో మహేశ్ బాబుకు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న గుంటూరు కారం మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఉంది. కాబట్టి, ఈ సండేకు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు గుంటూరు కారం సినిమా సూపర్ ఛాయిస్.
తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన కెప్టెన్ మిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. శివ రాజ్ కుమార్, నాజర్, సందీప్ కిషన్, నివేదా సతీష్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. బ్రిటీష్ కాలంలో కులాలపై ఉన్న వివక్షత, దాన్ని రూపుమాపేందుకు చేసిన పోరాటం వంటి అంశాలతో కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. ఈ ఆదివారం కుటుంబంతో కలిసి చూసేందుకు కెప్టెన్ మిల్లర్ కూడా ఒక మంచి ఆఫ్షనే.
హారర్ మూవీస్ చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈవారం ది నన్ 2 సినిమా సూపర్ ఎంపిక. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ది నన్‌కు సీక్వెల్‌గా ది కంజురింగ్ యూనివర్స్‌లో ఎనిమిదో చిత్రంగా ది నన్ 2 సినిమా ఎట్టకేలకు జియో సినిమా ఓటీటీలో ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మైఖేల్ చావెస్ దర్శకత్వం వహించిన ది నన్ 2 మూవీ సిస్టర్ ఐరీన్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఆమె మొదటి సినిమా సంఘటనల అనంతరం ఐదేళ్లకు ఏం జరిగిందనే కథతో ఇది తెరకెక్కింది. అతిగా భయపడేవారు ఈ సినిమాను స్కిప్ చేయడం మంచిది.
భూమి పెడ్నేకర్, సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్ ప్రధాన పాత్రలతో నటించిన సినిమా భక్షక్. సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో నివసించే అనాథ బాలికలపై జరిగే లైంగిక దాడుల నేపథ్యంలో భక్షక్ సినిమా తెరకెక్కింది. వాస్తవ సంఘటనల ఆధారంగా భక్షక్ మూవీని డైరెక్టర్ పుల్‌కిత్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న భక్షక్ మూవీని కుటుంబంతో కలిసి చూడొచ్చు. అయితే మరి చూపు తిప్పుకునే అడల్ట్ కంటెంట్ లేకుండా కథకు అవసరమైన సన్నివేశాలతో భక్షక్ రూపొందింది.
2010లో వచ్చిన కిచిడీ: ది మూవీకు సీక్వెల్ తెరెక్కిందే కిచిడీ 2: మిషన్ పాంతుకిస్తాన్. ఆతిష్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జయశ్రీ (వందనా పాఠక్), ప్రఫుల్ (రాజీవ్ మెహతా), బాబూజీ (అనంగ్ దేశాయ్), హిమాన్షు (జమ్నాదాస్ మజేతియా) లతో కలిసి టిఐఎ (ఇంటెలిజెంట్ ఏజెన్సీ) ఏజెంట్ కుశాల్ (అనంత్ విధాత్) అభ్యర్థన మేరకు పాంతుకిస్థాన్ రాజు బారి నుంచి ఒక భారతీయ శాస్త్రవేత్తను రక్షించే మిషన్‌ను ప్రారంభిస్తారు. సూపర్ హిట్ కామెడీకి సీక్వెల్‌గా వచ్చిన కిచిడీ 2 కుటుంబంతో కలిసి హాయిగా చూస్తూ నవ్వుకోవచ్చు.
టాపిక్