OTT Movies Web Series On Women Centric: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. వివిధ జోనర్లలో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తుంటాయి. అయితే, మహిళలను ఆధారంగా చేసుకుని స్ఫూర్తివంతమైన, వుమెన్ ఒరియెంటెడ్ సినిమాలు, సిరీస్‌లు సైతం ఎన్నో వచ్చాయి. మరి 2024, 2025లో వచ్చిన మహిళ ఆధారిత ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం.
ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. రీసెంట్‌గా ఈ సినిమాకు ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది. అలాగే, ఇందులో నటించిన కని కుశ్రుతికి బహుముఖ ప్రజ్ఞశాలి అవార్డ్ వరించింది.
16 ఏళ్ల కూతురికి కౌమార దశలో వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్ ఆమె చదువులకు ఆటంకం కలగకూడదని పరితపించే తల్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కొన్ని చోట్ల రియలిస్టిక్‌గా, బోల్డ్ సీన్స్‌తో ఉన్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అర్థమయ్యే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హిందీలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ 7.1 రేటింగ్ ఇచ్చింది.
మహిళల స్వేచ్ఛపై చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కిన మూవీ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముందుగా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో ప్రదర్శించిన ఈ సినిమా తర్వాత నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. సెమీ న్యూడ్ సీన్స్, శృంగార సన్నివేశాలతో సాగే ఈ మూవీకి ఐఎమ్‌డీబీ 7.1 రేటింగ్ ఇవ్వగా.. రొట్టెన్ టొమాటోస్ 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకు హిందీ రీమేక్‌గా తెరకెక్కిందే మిసెస్. సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. 2025 ఫిబ్రవరి 7 నుంచి హిందీలో జీ5లో మిసెస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్లో గృహిణిలు చేసే పని, మహిళలపై ఉండే చిన్నచూపు, అడవాళ్లు వంటింటికే పరిమితం అన్న అంశాల చుట్టూ మిసెస్ సాగుతుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ కంటెంట్ హిందీ సిరీస్ జిద్దీ గర్ల్స్. కాలేజ్‌లో అమ్మాయులు చేసే అల్లరి, బాయ్‌ఫ్రెండ్స్, అబ్బాయిలపై ఫీలింగ్స్, రొమాన్స్, కిస్సింగ్ సీన్స్, శృంగారం, మొండితనం వంటి ఎలిమెంట్స్‌తో తెరక్కిన జిద్దీ గర్ల్స్ వెబ్ సిరీస్ తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సిమ్రాన్, రేవతి కీలక పాత్రలు పోషించడం విశేషం.
లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఐదుగురు మహిళలు డ్రగ్స్ ఎలా సరఫరా చేశారు, వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ, ఎందుకు ఇలాంటి వృత్తిలోకి దిగారు అనే అంశాలతో సాగే డబ్బా కార్టెల్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ 7.1 రేటింగ్ ఇచ్చింది.
ఇందులో తెలుగు హీరోయిన్స్ జ్యోతిక, షాలిని పాండే నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో డబ్బా కార్టెల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా హిందీతోపాటు తెలుగు భాషలో డబ్బా కార్టెల్ ఓటీటీ రిలీజ్ అయింది.
సంబంధిత కథనం