Aa Okkati Adakku OTT: ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీలోకి ఈ వారమే వస్తుందా! ఏ ప్లాట్‍ఫామ్ అంటే..-ott movie allari naresh faria abdulla aa okkati adakku film may release on amazon prime video ott on this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aa Okkati Adakku Ott: ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీలోకి ఈ వారమే వస్తుందా! ఏ ప్లాట్‍ఫామ్ అంటే..

Aa Okkati Adakku OTT: ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీలోకి ఈ వారమే వస్తుందా! ఏ ప్లాట్‍ఫామ్ అంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2024 02:41 PM IST

Aa Okkati Adakku OTT Release: ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఆ ప్లాట్‍ఫామ్‍లో వస్తుందంటే..

Aa Okkati Adakku OTT: అల్లరి నరేశ్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు ఓటీటీలోకి ఈ వారమే రానుందా!: వివరాలివే
Aa Okkati Adakku OTT: అల్లరి నరేశ్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు ఓటీటీలోకి ఈ వారమే రానుందా!: వివరాలివే

Aa Okkati Adakku OTT: అల్లరి నరేశ్ హీరోగా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు చిత్రం మే 3వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. నరేశ్ మళ్లీ తన మార్క్ కామెడీలోకి వచ్చేయటంతో ఆసక్తి నెలకొంది. నాంది సినిమా తర్వాత కాస్త సీరియస్ మోడ్‍లోకి వెళ్లిన అల్లరి నరేశ్.. ఈ మూవీతో మళ్లీ ఎంటర్‌టైన్‍మెంట్ ట్రాక్ ఎక్కారు. అయితే, ఆ ఒక్కటి అడక్కు మూవీ అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈవారమే ఓటీటీలోకి!

ఆ ఒక్కటి అడక్కు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఈవారమే మే 31వ తేదీన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సమాచారం సినీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు, ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా కూడా సొంతం చేసుకుందని రూమర్లు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై క్లారిటీ రాలేదు. ముందుగా ప్రైమ్ వీడియో ఓటీటీలోనే ఈ చిత్రం అడుగుపెడుతుందని తెలుస్తోంది.

కలెక్షన్లు ఇలా..

ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3న రిలీజ్ కాగా తొలి వీకెండ్‍లో పర్వాలేదనిపించింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.4.5కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద స్లో అయింది. ఈ మూవీ మొత్తంగా సుమార్ రూ.8కోట్లలోపే వసూళ్లు సాధించిందని అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. సుహాస్ నటించిన ప్రసన్న వదనం పోటీలో ఉండడం కూడా ఈ మూవీకి కాస్త మైనస్ అయింది.

ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి మల్లీ అంకం దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్‍కు జోడీగా హీరోయిన్‍గా ఫారియా అబ్దుల్లా నటించారు. బాలీవుడ్ నటి జామీ లెవెర్ ఈ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. వెన్నెల కిశోర్, వైవా హర్ష, హరితేజ, అరియానా గ్లోరీ, రితూ చౌదరి కీలకపాత్రలు చేశారు.

ఆ ఒక్కటి అడక్కు మూవీని చిలక ప్రొడక్షన్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే గణపతి (అల్లరి నరేశ్) వివాహం కోసం పడే తంటాల చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు మల్లీ అంకం. కామెడీ, లవ్, కాస్త క్రైమ్ టచ్ కూడా ఈ కథకు జోడించారు. ఈ మూవీతో సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ వచ్చింది.

అల్లరి నరేశ్ లైనప్

అల్లరి నరేశ్ ప్రస్తుతం బచ్చల మల్లి అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ట్రాక్టర్ డ్రైవర్‌గా ఫుల్ మాస్ యాక్షన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహిస్తనున్నారు. ఈ మూవీలో రావు రమేశ్, హరితేజ కూడా కీరోల్స్ చేస్తున్నారు. హస్య మూవీస్ నిర్మిస్తున్న బచ్చల మల్లి చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా నరేశ్ లైనప్‍లో ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024