OTT: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దూసుకెళుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా
Bade Miyan Chote Miyan OTT: బడే మియా చోటే మియా సినిమా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఓటీటీలో మాత్రం దూసుకెళుతోంది. ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
OTT: కొన్ని సినిమాలు థియేటర్లలో డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణే దక్కించుకుంటుంటాయి. తాజాగా ఈ జాబితాలోకి వచ్చింది ‘బడే మియా చోటే మియా’ మూవీ. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ రిలీజ్‍కు ముందు చాలా బజ్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన బడే మియా చోటే మియా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ప్రస్తుతం ఓటీటీలో మాత్రం ఈ యాక్షన్ మూవీ అదరగొడుతోంది.
ట్రెండింగ్‍లో టాప్
బడే మియా చోటే మియా సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 6వ తేదీన అడుగుపెట్టింది. థియేటర్లలో బోల్తా కొట్టడంతో ఓటీటీలో ఎలాంటి పర్ఫార్మ్ చేస్తుందో అనే ఆసక్తి రేపింది. అయితే, ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్‍లలోనూ అందుబాటులోకి వచ్చింది.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో బడే మియా చోటే మియా సినిమా ప్రస్తుతం (జూన్ 15) టాప్‍లో ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో ఈ మూవీ ఫస్ట్ ప్లేస్‍కు చేరింది. ఓటీటీలోకి వచ్చి 9 రోజులు కాగా.. ఇంకా టాప్‍లోనే ఉంది.
బడే మియా చోటే మియా చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఆర్మీ బ్యాక్‍డ్రాప్‍లో భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, కథ, కథనం కొత్తగా లేకపోవటంతో ఈ మూవీకి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.
భారీ బడ్జెట్.. పేలవంగా వసూళ్లు
బడే మియా చోటే మియా సినిమా సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం బోల్తాకొట్టింది. దాదాపు కేవలం రూ.95కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం దక్కించుకుంది. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ప్లాఫ్‍ల్లో ఉన్న అక్షయ్, టైగర్ ష్రాఫ్ ఖాతాలో మరొకటి చేరింది. ఈ మూవీని చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ పతాకాలపై జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు.
రెండో ప్లేస్‍కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన తెలుగు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్ 14వ తేదీనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్‍లలో కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఒక్క రోజులోనే ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం (జూన్ 15) రెండో స్థానానికి వచ్చేసింది. త్వరలోనే బడే మియా చోటే మియాను వెనక్కి నెట్టి ఈ చిత్రం ట్రెండింగ్‍లో టాప్‍కు చేరే అవకాశాలు ఉన్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది.