OTT Most Watched Shows: ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో బిగ్ బాస్-ott most watched shows bigg boss ott 3 tops the list mirzapur 3 showtime in netflix prime video jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Most Watched Shows: ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో బిగ్ బాస్

OTT Most Watched Shows: ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో బిగ్ బాస్

Hari Prasad S HT Telugu

OTT Most Watched Shows: ఓటీటీల్లో గత వారం ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్, షోల లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో బిగ్ బాస్ ఓటీటీ 3 టాప్ లో ఉండటం విశేషం.

ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో బిగ్ బాస్

OTT Most Watched Shows: ఓటీటీల్లో సినిమాలు, ఇతర షోలను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టీవీల కంటే ఈ ఓటీటీలకు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. దీంతో సహజంగానే ఇందులో వచ్చే షోలలో ఏవి పాపులర్, వేటిని ఎక్కువ మంది చూస్తున్నారన్న ఆసక్తి ఉంటుంది. తాజాగా గత వారానికి సంబంధించి ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన షోలు, సినిమాల వివరాలను ఆర్మాక్స్ మీడియా తాజాగా రిలీజ్ చేసింది.

బిగ్ బాస్ ఓటీటీ 3 టాప్

జులై 15 నుంచి జులై 21 మధ్య ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన ఒరిజినల్స్ వివరాలను ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. "ఇండియాలో ఎక్కువ మంది చూసిన స్ట్రీమింగ్ ఒరిజినల్స్ ఇవే. జులై 15 నుంచి జులై 21 మధ్య ఆడియెన్స్ రీసెర్చ్ ఆధారంగా ఈ వివరాలను సేకరించాం. కేవలం ఇండియన్ ఆడియెన్స్ (మిలియన్లలో) కనీసం ఒక ఎపిసోడ్ లేదా కనీసం 30 నిమిషాలు (సినిమా) చూసిన వారి వివరాలు" అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ చేసింది.

ఈ జాబితా ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీ 3 ఎక్కువ మంది చూసిన షోగా నిలిచింది. ఈ రియాల్టీ షోని గతవారం.. 7.3 మిలియన్ల మంది చూశారు. అనిల్ కపూర్ తొలిసారి హోస్ట్ చేస్తున్న ఈ షో ఈ మధ్యే ఓ లైవ్ సెక్స్ వీడియోతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ షోని నిషేధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఎక్కువ మంది చూసిన షోగా నిలవడం గమనార్హం. ఈ షో జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

టాప్ 10లో ఉన్న షోలు, సినిమాలు ఇవే

బిగ్ బాస్ ఓటీటీ 3 తర్వాత టాప్ 10లో ఉన్న షోలు, సినిమాలను ఒకసారి చూస్తే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న కమాండర్ కరణ్ సక్సేనా రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ ను గత వారం 5.3 మిలియన్ల మంది చూసినట్లు ఆర్మాక్స్ మీడియా తెలిపింది. మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ది బాయ్స్ సీజన్ 4 ఉంది. ఈ షోని 4.9 మిలియన్ల మంది చూశారు.

నాలుగో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే వచ్చిన మూవీ వైల్డ్ వైల్డ్ పంజాబ్ (4.4 మిలియన్), ఐదో స్థానంలో ప్రైమ్ వీడియోలోని మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3 (4.3 మిలియన్లు) ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న షోటైమ్ వెబ్ సిరీస్ (3.4 మిలియన్లు), ఏడో స్థానంలో జియో సినిమాలోని హౌజ్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 (3.3 మిలియన్లు), 8వ స్థానంలో హాట్‌సార్ లోని బ్యాడ్ కాప్ (3 మిలియన్లు), 9వ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (2.6 మిలియన్లు), 10వ స్థానంలో సోనీలివ్ వెబ్ సిరీస్ 36 డేస్ (2.5 మిలియన్లు) ఉన్నాయి.