OTT Most viewed movies and shows: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఆ సిరీసే టాప్
OTT Most viewed movies and shows: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్, సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో మహారాణి వెబ్ సిరీస్ టాప్ లో ఉండటం విశేషం.
OTT Most viewed movies and shows: ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో వేటిని ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు? దీనిపై ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దీని ప్రకారం ప్రతి వారం ఓటీటీల్లో ఎక్కువ వ్యూస్ పొందిన మూవీస్, వెబ్ సిరీస్ ఏవో తెలుసుకోవచ్చు. తాజాగా మార్చి 11 నుంచి మార్చి 17 మధ్య ముగిసిన వారంలో ఎక్కువ వ్యూస్ పొందిన టాప్ 5 మూవీస్, సిరీస్ ఏవో చూడండి.
ఓటీటీల్లో టాప్ 5 ఇవే..
ఆర్మాక్స్ మీడియా రిపోర్టు ప్రకారం.. గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే. అయితే ఇవి కేవలం ఇండియాలో నమోదైన వ్యూస్. అందులోనూ హిందీకి సంబంధించినవే.
మహారాణి వెబ్ సిరీస్- సోనీలివ్
మహారాణి మూడో సీజన్ మార్చి 8న సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి రెండు సీజన్లలాగే మూడో సీజన్ కూడా దూసుకెళ్తోంది. తాజాగా గత వారం కూడా ఈ మహారాణి వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ కు మొత్తం 46 లక్షల వ్యూస్ రావడం విశేషం. రాణీ భారతి అనే పాత్రలో హుమా ఖురేషీ నటించిన ఈ సిరీస్ ను సుభాష్ కపూర్ డైరెక్ట్ చేశాడు.
షోటైమ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ షోటైమ్. బాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ప్రస్తుతానికి నాలుగు ఎపిసోడ్ల పార్ట్ 1 మాత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ షోటైమ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, మౌనీ రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మఖ్వానా నటించారు. ఈ వెబ్ సిరీస్ కు గత వారం 44 లక్షల వ్యూస్ వచ్చాయి.
షార్క్ ట్యాంక్ ఇండియా - సోనీలివ్
సోనీలివ్ ఓటీటీలో వస్తున్న ఓ వినూత్నమైన షో ఇది. పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్న కొందరు యువత ఈ షోకి వచ్చే ఇన్వెస్టర్లకు తమ బిజినెస్ ప్లాన్ ను వివరిస్తారు. అది నచ్చితే అందులో వాళ్లు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం షార్క్ ట్యాంక్ ఇండియా మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం ఈ షోకి 42 లక్షల వ్యూస్ వచ్చాయి.
మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 15న రిలీజైన మర్డర్ మిస్టరీ మూవీ ఇది. ఢిల్లీలోని ఓ క్లబ్ లో జరిగే హత్య, దానిచుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషనే ఈ సినిమా. మర్డర్ ముబారక్ మూవీలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, పంకజ్ త్రిపాఠీలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీకి గత వారం 33 లక్షల వ్యూస్ వచ్చాయి.
బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై- ప్రైమ్ వీడియో
ఓ బోర్డింగ్ స్కూల్, అందులోని నలుగురి ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథే ఈ బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై. ఈ షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం ఈ సిరీస్ కు 28 లక్షల వ్యూస్ రావడం విశేషం.