OTT Most viewed movies and web series: ఓటీటీల్లో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
OTT Most viewed movies and web series: ఓటీటీల్లో గత వారం అంటే మార్చి 18 నుంచి మార్చి 25 వరకు ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇది. ఇందులో మీరు ఎన్ని చూశారు?
OTT Most viewed movies and web series: ఓటీటీల్లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఒరిజినల్స్ కాగా.. మరికొన్ని థియేటర్లలో రిలీజ్ తర్వాత ఓటీటీల్లోకి వచ్చినవి ఉంటాయి. ఇలా ఓటీటీల్లో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లలో గత వారం అంటే మార్చి 18 నుంచి మార్చి 25 మధ్య ఎక్కువ మంది చూసినవి ఏవో ఇక్కడ చూడండి.

ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్
ఆర్మాక్స్ మీడియా రిపోర్టు ప్రకారం గత వారంతోపాటు అంతకుముందు ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ 5 ఇప్పుడు చూద్దాం. వీటిలో సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి.
మహారాణి - సోనీలివ్
సోనీలివ్ ఓటీటీలోకి మార్చి 7న వచ్చిన మహారాణి వెబ్ సిరీస్ మూడు వారాలకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ టాప్ 5లో ఉండటం విశేషం. హుమా ఖురేషీ నటించిన ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గత వారం అంటే మార్చి 18 నుంచి మార్చి 25 మధ్య కూడా ఈ సిరీస్ కు ఏకంగా 26 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది ఐదో స్థానంలోఉంది.
లూటేరే - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
గత శుక్రవారం (మార్చి 22) హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ లూటేరే. సోమాలియా పైరేట్స్ షిప్ హైజాకింగ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ తొలి రెండు ఎపిసోడ్లు మాత్రమే రిలీజయ్యాయి. ఈ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో 32 లక్షల వ్యూస్ తో ఈ సిరీస్ నాలుగో స్థానంలో ఉంది.
షార్క్ ట్యాంక్ ఇండియా 3 - సోనీలివ్
పారిశ్రామికవేత్తలు కావాలని కలలు కంటున్న యువత పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వినూత్నమైన బిజినెస్ ఐడియాలతో వచ్చే షోనే ఈ షార్క్ ట్యాంక్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. 12 మందితో మూడో సీజన్ కొనసాగుతోంది. గత వారం ఈ షోకి 40 లక్షల వ్యూస్ వచ్చాయి.
యే వతన్ మేరే వతన్ - ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజైన మూవీ యే వతన్ మేరే వతన్. ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వస్తున్నా.. ప్రేక్షకులు మాత్రం బాగానే చూస్తున్నారు. గత వారం ఈ మూవీకి 42 లక్షల వ్యూస్ రావడం విశేషం.
మర్డర్ ముబారక్ - నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా వచ్చిన మూవీ మర్డర్ ముబారక్. రెండు వారాలుగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గత వారం అయితే 44 లక్షల వ్యూస్ తో ఏకంగా టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ సినిమాలోనూ సారా అలీ ఖాన్ తోపాటు కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠీలాంటి బాలీవుడ్ నటీనటులు నటించారు.