OTT Family Drama: గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీ ఇదే.. ఓటీటీలో అదరగొడుతున్న మలయాళం రీమేక్ ఫ్యామిలీ డ్రామా
OTT Family Drama: ఓటీటీలో ఇప్పుడో మలయాళం రీమేక్ ఫ్యామిలీ డ్రామా అదరగొడుతోంది. అంతేకాదు గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాగానూ నిలిచింది. జీ5 ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలుస్తుండటం విశేషం.
OTT Family Drama: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్, థ్రిల్లర్స్, హారర్ జానర్ సినిమాలే కాదు.. ఫ్యామిలీ డ్రామాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని నిరూపిస్తోంది ఈ మధ్యే వచ్చిన ఓ హిందీ మూవీ. మలయాళంలో నాలుగేళ్ల కిందట వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీకి రీమేక్ గా వచ్చిన మిసెస్ (Mrs.) అదరగొడుతోంది. జీ5 ఓటీటీలో పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది.
మిసెస్ మూవీ రికార్డులు
దంగల్ మూవీ ఫేమ్ సాన్యా మల్హోత్రా నటించిన మూవీ మిసెస్ (Mrs.). ఈ సినిమా జీ5 ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. "మిసెస్ ఓ బ్లాక్‌బస్టర్ డెబ్యూ చేసింది. మిస్ కావద్దు" అని క్యాప్షన్ తో ఓ పోస్ట్ చేసింది. "రికార్డులు బ్రేకవుతున్నాయి. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎవర్" అనే క్యాప్షన్ తో మరో పోస్ట్ కూడా జీ5 ఓటీటీ చేయడం విశేషం.
అంతేకాదు ఇది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా అని కూడా తెలిపింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పడానికి ఈ రికార్డులు చాలు. ముఖ్యంగా సాన్య మల్హోత్రా నటనకు ఫిదా అవుతున్నారు.
మిసెస్ మూవీ గురించి..
మిసెస్ మూవీని ఆరతి కాదవ్ డైరెక్ట్ చేసింది. ఈ మూవీ 2021లో వచ్చిన మలయాళం మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కు రీమేక్. అప్పట్లో ఆ సినిమాకు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది.
2023లో ఇదే సినిమాను తమిళంలోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు హిందీలో మిసెస్ పేరుతో తీసుకురాగా.. అది నేరుగా జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. సాన్యా మల్హోత్రాతోపాటు నిషాంత్ దహియా, కన్వల్జీత్ సింగ్ నటించారు. ఓ డ్యాన్సర్, డ్యాన్స్ టీచర్ అయిన అమ్మాయి జీవితం పెళ్లి తర్వాత ఎలా తలాకిందులైందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
పెళ్లి తర్వాత అత్తవారింట్లో వాళ్లకు సేవలు చేయడమే జీవితంగా మారిపోతుంది. చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మిసెస్ మూవీని న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి నార్త్ ఇండియాలో జరిగిన కథగా చిత్రీకరించినట్లుగా డైరెక్టర్ ఆరతి చెప్పారు.
సంబంధిత కథనం