OTT Thriller Movie: రెండు ఓటీటీల్లోకి వస్తున్న మలయాళం థ్రిల్లర్ మూవీ.. భార్యనే చంపి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి..
OTT Thriller Movie: ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. భార్యను చంపి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే ఓ తెలివైన గుమాస్తా చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి సక్సెస్ సాధించింది.
OTT Thriller Movie: ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ జానర్లలో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు అసలు కొదవే లేదు. ఇప్పుడదే జానర్లో మరో సినిమా రాబోతోంది. అది కూడా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ కావడం విశేషం. ఈ సినిమా పేరు గుమాస్తాన్ (Gumasthan). చట్టానికి దొరకని ఓ క్రూరమైన కిల్లర్ అనే ట్యాగ్‌లైన్ తో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది.
త్వరలోనే గుమాస్తాన్ స్ట్రీమింగ్ ఉంటుందని ఈ రెండు ఓటీటీలు అనౌన్స్ చేశాయి. అమల్ కే. జోబీ డైరెక్ట్ చేసిన గుమాస్తాన్ సినిమాలో జైస్ జోస్, షాజు శ్రీధర్, దిలీష్ పోతన్, అలెగ్జాండర్ ప్రశాంత్ లాంటి వాళ్లు నటించారు.
గుమాస్తాన్ కథేంటంటే?
గుమాస్తాన్ తన భార్యనే చంపి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చూసే ఓ తెలివైన గుమాస్తా చుట్టూ తిరిగే స్టోరీ. ఈ మూవీ మొత్తం పల్లిపాదన్ (జైస్ జోస్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ ప్రముఖ అడ్వొకేట్ దగ్గర గుమాస్తాగా పని చేస్తుంటాడు. ఎప్పుడూ తన భార్యను కొడుతూ ఉంటాడు. అలా కొడుతుండగా అతని ఇంట్లోని పని మనిషి చూస్తుంది.
మరుసటి రోజు ఆమె వచ్చి చూడగా.. అతని భార్య కనిపించదు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంట్లో అసలు ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడే అసలు ట్విస్టులు మొదలవుతాయి. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ తెలివైన గుమాస్తా వేసే ఎత్తులు, ట్విస్టులతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సాగుతుంది.
మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాగా.. కథ, కథనం పరంగా మంచి రివ్యూలే వచ్చాయి. అయితే కాస్త నెమ్మదిగా సాగడమే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు థియేటర్ల కంటే ఓటీటీల్లో ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తోంది. ఆ లెక్కన ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ లలోకి రాబోతున్న ఈ గుమాస్తాన్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.