OTT Malayalam Survival Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam Survival Comedy: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం సర్వైవల్ కామెడీ మూవీ రాబోతోంది. గుర్ (Grrr) పేరుతో నెలన్నర కిందట రిలీజైన ఈ సినిమా.. త్వరలోనే హాట్‌స్టార్ లోకి రానుంది.
OTT Malayalam Survival Comedy: మలయాళం సినిమాలు అంటే ఇష్టమా? అయితే ఇప్పుడు ఓటీటీలోకి ఓ డిఫరెంట్ జానర్ మలయాళం మూవీ రాబోతోంది. సర్వైవల్ కామెడీ జానర్లో నెలన్నర కిందట థియేటర్లలోకి వచ్చిన గుర్ (Grrr..) మూవీ త్వరలోనే రానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వెల్లడించింది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఓటీటీలో ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
సర్వైవల్ కామెడీ మూవీ
సర్వైవల్ డ్రామా జానర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అలాంటి జానర్ కు కామెడీని జోడించి ఈ గుర్ (Grrr...) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డైరెక్టర్ జై కే తొలిసారి ఓ కామెడీ జానర్లో సినిమా తీశాడు. ఇందులో కుంచకో బొబన్, సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోమవారం (ఆగస్ట్ 5) వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిపింది.
“త్వరలోనే మీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో గర్జించబోతోంది. గుర్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. అయితే తేదీ మాత్రం వెల్లడించలేదు. జూన్ 15న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అసలు భిన్నంగా ఉన్న కథే పెద్ద బలం. అయితే దానిని తెరపై ప్రజెంట్ చేసిన విధానం అంత బాగా లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాలో రెజిమోన్ అనే ఓ యువ పారిశ్రామికవేత్తగా కుంచకో నటించాడు. ఓ రాజకీయవేత్త కూతురుని ప్రేమించే అతడు.. ఓరోజు జూలోని ఓ సింహం గుహలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుంటాడు. అతన్ని రక్షించడానికి మొత్తం జూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
వినడానికి ఈ స్టోరీ భిన్నంగా అనిపించినా.. దీనిని ఆకట్టుకునేలా తెరపైకి తీసుకురాలేకపోయాడు డైరెక్టర్ జై కే. కేవలం కామెడీని పండించడానికే ఎక్కువగా ప్రయత్నించడంతో అసలు స్టోరీ గాడి తప్పింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాలో నిజమైన 8 ఏళ్ల ఓ సింహాన్ని షూటింగ్ కోసం ఉపయోగించడం విశేషం.
హాట్‌స్టార్ మలయాళం మూవీస్
హాట్‌స్టార్ లో ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది రిలీజై మంచి విజయం సాధించిన కామెడీ మూవీ గురువాయూర్ అంబలనడయిల్ మూవీతోపాటు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ఫలిమి, నేరు, అబ్రహం ఓజ్లర్, 12th మ్యాన్, రోమాంచంలాంటి సూపర్ డూపర్ హిట్ మలయాళ సినిమాలు హాట్‌స్టార్ ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడు త్వరలోనే ఈ గుర్ మూవీ కూడా రాబోతోంది.