OTT Horror Web Series: తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott malayalam horror web series 1000 babies trailer released to stream on disney plus hotstar from 18th october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Web Series: తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Horror Web Series: తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

OTT Malayalam Horror Web Series: మలయాళం హారర్ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 8) రాత్రి ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో ఓటీటీలోకి వస్తున్న మలయాళ హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Malayalam Horror Web Series: ఓటీటీలోకి మరో వెన్నులో వణుకు పుట్టించే హారర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్.. ఆ భాషతోపాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ పేరు 1000 బేబీస్. కొన్నాళ్ల కిందట ఓ పోస్టర్ ద్వారా ఈ సిరీస్ విషయాన్ని అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ తోపాటు స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడించారు.

1000 బేబీస్ స్ట్రీమింగ్ డేట్

ఈ మలయాళ హారర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అక్టోబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీలాంటి భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ భయపెడుతోంది. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఇందులో లీడ్ రోల్లో కనిపించనుంది.

1000 బేబీస్ వెబ్ సిరీస్.. పెద్ద ఎత్తున శిశువుల హత్యలకు సంబంధించిన స్టోరీగా కనిపిస్తోంది. ఆ హత్యలకు కారణమైన వాడిని పట్టుకునే పోలీసు పాత్రలో ప్రముఖ నటుడు రెహమాన్ నటించాడు. నెల రోజుల కిందట ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఈ సిరీస్ స్టోరీపై మరికొంత స్పష్టత ఇచ్చింది.

1000 బేబీస్ ట్రైలర్

కేరళలోని ఓ హాస్పిటల్ లో జరిగే అక్రమాలు, అక్కడి శిశువులు మాయమవుతున్నా తీరు, ఆ తర్వాత వాళ్లను హత్య చేయడం, ఈ వివరాలు తెలిసిన నీనా గుప్తా వాళ్ల పేర్లు, అడ్రెస్ లు తన ఇంట్లోని గోడలపై రాయడం.. ఇలా 1000 బేబీస్ ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగిపోయింది. నజీమ్ కోయా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.

ఈ 1000 బేబీస్ హారర్ వెబ్ సిరీస్ లో నీనా గుప్తా, రెహమాన్ తోపాటు సంజూ శివరామ్, అశ్విన్ కుమార్, ఆదిల్ ఇబ్రహీం, షాజు శ్రీధర్, శ్రీకాంత్ బాలచంద్రన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. 32 ఏళ్ల కిందట ఓ రెండు మలయాళం సినిమాల్లో నటించిన నీనా గుప్తా మరోసారి ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆ ఇండస్ట్రీలోకి తిరిగి అడుగుపెట్టింది.

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ అక్టోబర్ 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

హాట్‌స్టార్ మలయాళం మూవీస్

ఓటీటీల్లోని మలయాళం కంటెంట్ లో చాలా వరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే ఉంటుంది. ఇప్పటికే ఈ ఓటీటీలో ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. వాటిలో ఈ మధ్యే వాజా అనే కామెడీ మూవీ కూడా వచ్చింది.

ఇదే కాకుండా గురువాయూర్ అంబలనడయిల్, గుర్, ప్రేమలు, అబ్రహం ఓజ్లర్, మంజుమ్మెల్ బాయ్స్, నేరు, జయ జయ జయ జయ హే, కన్నూర్ స్క్వాడ్, కింగ్ ఆఫ్ కోత, హృదయం, వాలట్టీ, నెయ్‌మార్ లాంటి సినిమాలు హాట్ స్టార్ లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు మూవీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.