OTT Malayalam Horror Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ.. రెండు రోజుల ముందుగానే..-ott malayalam horror movie phoenix now streaming on manorama max ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Horror Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ.. రెండు రోజుల ముందుగానే..

OTT Malayalam Horror Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ.. రెండు రోజుల ముందుగానే..

Hari Prasad S HT Telugu

OTT Malayalam Horror Movie: ఓటీటీలోకి సడెన్ గా ఓ మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 4) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినా.. ముందుగానే రావడం విశేషం.

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం రొమాంటిక్ హారర్ మూవీ.. రెండు రోజుల ముందుగానే..

OTT Malayalam Horror Movie: మలయాళం నుంచి మరో హారర్ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు 10 నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఈ సినిమా పేరు ఫీనిక్స్. అజు వర్గీస్, అనూప్ మేనన్ నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫీనిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్

తాజాగా ఓటీటీలోకి వచ్చిన మలయాళ రొమాంటిక్ హారర్ మూవీ పేరు ఫీనిక్స్. ఈ సినిమా మనోరమ మ్యాక్స్ లో మంగళవారం (అక్టోబర్ 1) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విష్ణు భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 4న వస్తుందని భావించినా మూడు రోజుల ముందే మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు.

ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నా.. ఫ్రీగా చూసే అవకాశం లేదు. రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనోరమ మ్యాక్స్ లో సబ్‌స్క్రిప్షన్ పై మూవీ చూడొచ్చు.

ఫీనిక్స్ మూవీ ఎలా ఉందంటే?

మలయాళం మూవీ మేకర్స్ ఎలాంటి జానర్ సినిమా తీసినా తమదైన స్టైల్లో వివిధ భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. అలాంటి కోవలోనిదే ఈ ఫీనిక్స్ మూవీ కూడా. రొమాంటిక్ హారర్ జానర్ లో వచ్చిన ఈ ఫీనిక్స్ మూవీ కాన్సెప్ట్, ట్విస్టులు అక్కడి ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించాయి. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా చూసే వీలు కలిగింది.

ల‌వ్‌, హార‌ర్ అంశాల‌ను మిక్స్ చేస్తూ పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు ఫీనిక్స్ మూవీని తెర‌కెక్కించాడు. 1970, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఫీనిక్స్ మూవీ క‌థ సాగుతుంది. జాన్ (అజూ వ‌ర్గీస్‌) ఓ లాయ‌ర్ ఎవ‌రితో అంత‌గా క‌ల‌వ‌డు. ఊరికి దూరంగా స‌ముద్రం ద‌గ్గ‌రంలో ఉన్న ఓ పాత‌కాలం నాటి ఇంట్లోకి భార్య‌, ముగ్గురు పిల‌ల్ల‌తో క‌లిసి అద్దెకు దిగుతాడు. అక్క‌డికి వ‌చ్చిన కొద్ది రోజుల‌కు జాన్‌కు ఉత్త‌రాలు రావ‌డం మొద‌లువుతాయి.

ఫ్రెడ్డీ అనే వ్య‌క్తి ఫ్ర‌మ్ అడ్ర‌స్ లేకుండా జాన్‌కు ఉత్త‌రాలు పంపిస్తుంటాడు. ఫ్రెడ్డీతో జాన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఇంట్లో 1970 ద‌శ‌కంలో ఉన్న ప్రేమ‌జంట ఫ్రెడ్డీ, అన్నా రోజ్ క‌థేమిటి? అన్నా రోజ్ ఏలా చ‌నిపోయింది. ఆమె ఆత్మ జాన్ కుటుంబ‌స‌భ్యుల‌ను ఎందుకు ఆవ‌హించింది? ఆ ఇంటి మిస్ట‌రీని జాన్ ఎలా సాల్వ్ చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.