OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత వస్తున్న మలయాళం కామెడీ మూవీ.. నవ్వీనవ్వీ పొట్ట చెక్కలవుతుంది
OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత ఓ హిట్ మలయాళం కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కాగా.. మొత్తానికి శుక్రవారం (డిసెంబర్ 27) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
OTT Malayalam Comedy Movie: మలయాళం మూవీ, అందులోనూ కామెడీ.. ఈ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను చాలా రోజులుగా ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా తానారా (Thaanara) అనే మూవీ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో ఆగస్టు 23నే రిలీజైనా.. అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో చాలా రోజుల పాటు ఏ ఓటీటీ ముందుకు రాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రముఖ మలయాళ ఓటీటీ మనోరమా మ్యాక్స్ లోకి అడుగుపెడుతోంది.
తానారా ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం కామెడీ మూవీ తానారా ఆగస్టులో రిలీజైంది. కామెడీ సినిమాల స్పెషలిస్టు డైరెక్టర్ హరిదాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ తానారా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రేక్షకులను బాగానే నవ్వించింది.
మొత్తానికి ఈ మూవీ నాలుగు నెలల తర్వాత శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా మలయాళం ఆడియోలోనే రానుంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
తానారా మూవీ స్టోరీ ఏంటంటే?
తానారా మూవీ ఆదర్శ్ శ్రీవరాహం అనే ఓ యువ పొలిటీషియన్, అతని భార్య అంజలి చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. తన భర్తపై ఓ కన్నేసి ఉంచడానికి అంజలి.. జేమ్స్ బాండ్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ సాయం తీసుకుంటుంది. అదే సమయంలో ఆదర్శ్ ఫామ్ హౌజ్ లో ఓ దొంగ పడతాడు. ఇది పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది.
ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరూ మళ్లీ ఆనందంగా జీవిస్తారా లేదా అన్నది మూవీలో చూడొచ్చు. సినిమాలో ఎమ్మెల్యే ఆదర్శ్ గా టామ్ చాకో, దొంగగా విష్ణు ఉన్నికృష్ణన్ నటించారు. అయితే సినిమా మంచి నవ్వులు పూయించిందని మాత్రం మొదట్లోనే రివ్యూలు వచ్చాయి. కానీ చాలా వరకు ఈ సినిమా థియేటర్లలో వచ్చినట్లుగా కూడా తెలియకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఐఎండీబీలో మాత్రం 6.8 రేటింగ్ ఉంది.