OTT Malayalam Movie: ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం కామెడీ డ్రామా.. ఇయర్ ఎండ్ నైట్ ప్లాన్ చేయండి-ott malayalam comedy drama panchavalsara padhathi now streaming on manorama max ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Movie: ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం కామెడీ డ్రామా.. ఇయర్ ఎండ్ నైట్ ప్లాన్ చేయండి

OTT Malayalam Movie: ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం కామెడీ డ్రామా.. ఇయర్ ఎండ్ నైట్ ప్లాన్ చేయండి

Hari Prasad S HT Telugu
Dec 31, 2024 01:40 PM IST

OTT Malayalam Movie: ఓటీటీలోకి 9 నెలల తర్వాత ఓ హిట్ మలయాళం కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి మంగళవారం (డిసెంబర్ 31) డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.

ఓటీటీలోకి  9 నెలల తర్వాత వచ్చిన మలయాళం కామెడీ డ్రామా.. ఇయర్ ఎండ్ నైట్ ప్లాన్ చేయండి
ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం కామెడీ డ్రామా.. ఇయర్ ఎండ్ నైట్ ప్లాన్ చేయండి

OTT Malayalam Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి 2024లో ఎన్నో హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి పంచవల్సర పద్ధతి (Panchavalsara Padhathi). ఈ సినిమా ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. చాలా మలయాళం సినిమాల్లాగే ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. మొత్తానికి ఈ సినిమాను మంగళవారం (డిసెంబర్ 31) నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

yearly horoscope entry point

పంచవల్సర పద్ధతి ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో హిట్ కామెడీ డ్రామా ఈ పంచవల్సర పద్ధతి. ఈ ఏడాది ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఐఎండీబీలోనూ 7.3 రేటింగ్ లభించింది. మొత్తానికి 9 నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

మనోరమా మ్యాక్స్ కేవలం మలయాళం ఆడియోలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసే అలవాటు ఉంటే.. ఈ ఇయర్ ఎండ్ ఓటీటీ మూవీస్ లిస్టులో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోండి.

ఏంటీ పంచవల్సర పద్ధతి మూవీ?

ఈ పంచవల్సర పద్ధతి ఓ కామెడీ డ్రామా. ఈ సినిమాను అవార్డు విన్నింగ్ డైరెక్టర్ పీజీ ప్రేమ్‌లాల్ డైరెక్ట్ చేశాడు. సిజు విల్సన్ లీడ్ రోల్లో నటించాడు. ఇక ఫిమేల్ లీడ్ గా కృష్ణందు మేనన్ నటించింది. ఐదేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ లోనే ఉండటం గమనార్హం. మొత్తానికి 2024, ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాగా.. ఓటీటీలోకి మరో 9 నెలల నిరీక్షణ తర్వాత వచ్చింది.

ఇది కేరళలోని కాలంబరి గ్రామంలో జరిగిన కథగా తెరకెక్కించారు. ఇందులో సనోజ్ అనే పాత్రలో సిజు విల్సన్ నటించాడు. ఆ గ్రామంలోని వారికి స్థానిక జానపద కథల్లోని పాత్ర కలంబసుర కనిపించడం మొదలవుతుంది. దీని వెనుక గుట్టు ఏదో తెలుసుకోవడానికి సనోజ్ ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ క్రమంలో సనోజ్ ఎదుర్కొనే సవాళ్లేంటన్నది ఈ మూవీలో చూడొచ్చు.

మలయాళం ఇండస్ట్రీ నుంచి 2024లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ ఏకంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం, ఆవేశం, ప్రేమలులాంటి సినిమాలు కేరళలోనే కాదు మొత్తం ఇండియాలోని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఈ సినిమాలన్నీ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner