మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి గురువారం (మే 1) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బుధవారం (ఏప్రిల్ 30) సాయంత్రం 5 గంటలకే డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ బ్రొమాన్స్ (Bromance). బాక్సాఫీస్ దగ్గర రూ.13.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
“గతంలో ఎన్నడూ చూడనటువంటి నవ్వుల రైట్ ప్రారంభమైంది. బ్రొమాన్స్ ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ఓటీటీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ప్రతి సినిమాను చెప్పినదాని కంటే ఒక రోజు ముందే తీసుకురావడం సోనీ లివ్ ఓ అలవాటుగా మార్చుకుంది. ఇప్పుడీ బ్రొమాన్స్ కూడా అంతే. కనిపించకుండా పోయిన అన్న కోసం అతని స్నేహితులతో కలిసి తమ్ముడి సాగించే వేట చుట్టూ తిరిగే మూవీ ఇది.
బ్రొమాన్స్ మూవీని అరుణ్ డి. జోస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోమన్, కళాభవన్ షాజోన్, భరత్ బోపన్నలాంటి వాళ్లు నటించారు. గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. ఇదొక అడ్వెంచర్ కామెడీ మూవీ. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది.
ఈ సినిమా బింటో, షింటో అనే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ల స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. బింటో అన్న షింటో కనిపించకుండా పోతాడు. దీంతో బింటో, తన అన్న స్నేహితులు కలిసి అతని కోసం వెతకడం మొదలుపెడతారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా ఈ కాలం యువత ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.13.5 కోట్లు వసూలు చేసిన మూవీ ఇది.
సంబంధిత కథనం