OTT Legal Drama: ఓటీటీలో దుమ్ము రేపుతున్న లీగల్ డ్రామా.. 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డు-ott legal drama sirf ek banda kaafi hain movie clocks 1 billion streaming minutes zee5 ott statement reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Legal Drama: ఓటీటీలో దుమ్ము రేపుతున్న లీగల్ డ్రామా.. 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డు

OTT Legal Drama: ఓటీటీలో దుమ్ము రేపుతున్న లీగల్ డ్రామా.. 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డు

Hari Prasad S HT Telugu

OTT Legal Drama: ఓటీటీలో ఓ లీగల్ డ్రామా మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వెల్లడించింది.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న లీగల్ డ్రామా.. 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డు

OTT Legal Drama: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌, థ్రిల్లర్‌, హారర్‌ జానర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడో లీగల్ డ్రామా మాత్రం దుమ్ము రేపుతోంది. కొన్నాళ్లుగా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పేరు సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల రికార్డును అందుకోవడం విశేషం.

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ రికార్డు

థియేటర్ల కంటే ఓటీటీకి డిమాండ్ ఎక్కువగా ఉంటున్న ఈ రోజుల్లో నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ అవుతున్న సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి సినిమానే ఈ సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై. బాలీవుడ్ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ నటించిన ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలో 100 స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది.

ఇప్పటి వరకూ చాలా తక్కువ సినిమాలకే ఈ రికార్డు సాధ్యమైంది. ఈ సినిమాలో కమర్షియల్ వాల్యూస్ ఏవీ లేవు. పాటలు, ఫైట్లు, మితిమీరిన హీరోయిజాల్లాంటివి కనిపించవు. ఓ స్వామీజీ చేసిన తప్పుడు పని, అతనికి శిక్ష విధించడానికి ఓ సాధారణ లాయర్‌ చేసే ప్రయత్నమే ఈ సినిమాలో చూడొచ్చు. ఆ స్వామీజీకి శిక్ష విధించే క్రమంలో ఆ సాధారణ లాయర్‌ ఎదుర్కొనే సవాళ్లేంటన్నవి కూడా ఇందులో చూపించారు.

100 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్‌

సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై.. అంటే ఒక్క వ్యక్తి చాలు అని అర్థం. వ్యవస్థ, లక్షల మంది ప్రజల అండ చూసుకొని తప్పుడు పనులకు పాల్పడిన ఓ బాబాను బోనెక్కించిన ఘనత ఒకే ఒక్కడికి దక్కుతుంది. ఆ కాన్సెప్ట్‌లోనే ఈ సినిమా తీశారు. ఇప్పుడీ సినిమా 100 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసినట్లు జీ5 ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

"భయ్యాజీ వస్తున్నాడు. సిద్ధంగా ఉండండి. సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై సినిమాకు 100 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదైన సందర్భంగా ఈ మూవీ మేకర్స్ మరో బ్లాక్‌బస్టర్ భయ్యాజీతో వస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయీ 100వ సినిమా. భయ్యాజీ జులై 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్‌ తో జీ5 ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.

అసలేంటీ బందా మూవీ స్టోరీ?

ఏక్ బందా కాఫీ హై లేదా కేవలం బందా.. ఈ సినిమా ఓ లీగల్ డ్రామా. ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. అతనికి ఈ కేసులో శిక్ష పడటంలో కీలకపాత్ర పోషించిన అడ్వొకేట్ పీసీ సోలంకి చేసిన పోరాటాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా నేరుగా జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

కోర్టు రూమ్ డ్రామా, కేసుల వాదోపవాదాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో అసలు ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. పాటలు, ఫైట్లు అసలే కనిపించవు. ఈ మూవీ 2023 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్టర్‌, బెస్ట్ యాక్టర్‌ కేటగిరీల కింద అవార్డులు అందుకోవడం విశేషం.