OTT Korean Web Series: ఒకే రోజు రెండేసి ఓటీటీల్లోకి రెండు కొరియన్ వెబ్ సిరీస్.. ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Korean Web Series: ఒకే రోజు రెండేసి ఓటీటీల్లోకి రెండు కొరియన్ వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కాగా.. మరొకటి రొమాంటిక్ కామెడీ జానర్ కావడం విశేషం.
OTT Korean Web Series: ఓటీటీల్లో కొరియన్ డ్రామాస్ రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. చాలా వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన మూవీస్, వెబ్ సిరీస్ లను కూడా ఇక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. తాజాగా బుధవారం (నవంబర్ 6) రెండు కొరియన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒకటి రెండు ఓటీటీల్లోకి, తెలుగులోనూ రావడం విశేషం.
రేడియంట్ ఆఫీస్ వెబ్ సిరీస్
సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రేడియంట్ ఆఫీస్. ఇది 2017లో స్ట్రీమింగ్ అయిన 16 ఎపిసోడ్ల సిరీస్. ఇప్పుడు ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ ద్వారా భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరియన్ ఆడియతోపాటు తెలుగు, హిందీ, తమిళంలలోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ యున్ హో-వోన్ అనే ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.
ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించి అన్ని చోట్లా తిరస్కరణలకు గురై ఆత్మహత్యాయత్నం చేస్తుందామె. అయితే హాస్పిటల్లో కోలుకున్న తర్వాత ఆమెకు అనుకోకుండా ఓ ఉద్యోగం వస్తుంది. అప్పటి వరకూ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె.. ఇక పోయేదేమీ లేదనుకుంటూ ఆ ఉద్యోగాన్ని అలవోకగా తనదైన స్టైల్లో సులువుగా చేసేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉండే ఆమె సీనియర్ తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ రేడియంట్ ఆఫీస్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
బ్లైండ్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇక బుధవారమే (నవంబర్ 6) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన మరో కొరియన్ వెబ్ సిరీస్ బ్లైండ్ (Blind). ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. 2022లో సౌత్ కొరియాలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐఎండీబీలో ఏకంగా 8.5 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతానికి కేవలం కొరియన్ ఆడియోతోనే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసే అలవాటు ఉంటే ఈ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు. అనుకోకుండా కొన్ని నేరాల వల్ల బాధితులుగా మారిన కొందరు సాధారణ వ్యక్తుల చుట్టూ తిరిగే కథే ఈ బ్లైండ్ వెబ్ సిరీస్.