OTT Korean Dramas: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ మూవీ, వెబ్ సిరీస్
OTT Korean Dramas: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి రెండు కొరియన్ డ్రామాస్ తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి రొమాంటిక్ మూవీ కాగా.. మరొకటి వెబ్ సిరీస్. ఈ రెండింటికీ ఐఎండీబీలో మంచి రేటింగ్స్ ఉన్నాయి.

OTT Korean Dramas: కొరియన్ డ్రామాస్ రెండు ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. నిజానికి ఆ భాషలో చాలా రోజుల కిందటే వచ్చిన ఈ మూవీ, వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. కొరియన్ డ్రామాస్ కు కేరాఫ్ అయిన ఎంఎక్స్ ప్లేయర్ తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఇవి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ
కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ బికాజ్ ఐ లవ్ యూ (Because I Love You) ఇప్పుడు కొరియన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో అందుబాటులో ఉంది.
నిజానికి ఈ బికాజ్ ఐ లవ్ యూ మూవీ 2017లోనే కొరియాలో వచ్చింది. ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉన్న ఈ సినిమా స్టోరీ కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రేమలో పడి కష్టాలు పడుతున్న వారి శరీరాల్లోకి వెళ్లి వాళ్లకు మార్గదర్శకత్వం చేసే ఓ ఆత్మ కథే ఈ బికాజ్ ఐ లవ్యూ మూవీ.
లీ హియాంగ్ అనే వ్యక్తి ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత అతని ఆత్మ ప్రేమలో పడిన వివిధ వ్యక్తుల శరీరాల్లోకి వెళ్తుంది. అతని ఆత్మకు స్కల్లీ అనే ఓ హైస్కూల్ స్టూడెంట్ సాయం చేస్తూ ఉంటుంది. భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి రావడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
కొరియన్ డ్రామా వెబ్ సిరీస్
ఇక ఇవే ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లోకి వచ్చిన మరో వెబ్ సిరీస్ ప్రెట్టీ అగ్లీ. కొరియాలో 2016లో బ్యూటీఫుల్ గాంగ్ షిమ్ పేరుతో స్ట్రీమింగ్ అయిన సిరీస్ ఇది. ఇది ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ తిరిగే బ్యూటీఫుల్ స్టోరీ.
ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆ రెండు ఓటీటీల్లోకి కొరియన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎంఎక్స్ ప్లేయర్ లో ఎవరైనా ఫ్రీగా ఈ సిరీస్ చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.
ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీని ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎంఎక్స్ ప్లేయర్ లో ఉన్న మొత్తం కంటెంట్ ను ఫ్రీగా చూసేయొచ్చు. ఇందులో చాలా వరకు కొరియన్ కంటెంట్ తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.