సైనికులపై రివేంజ్ తీర్చుకునే మంత్రగత్తె.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇలాంటి ఓటీటీ హారర్ మూవీ అస్సలు చూసిండరు!-ott horror thriller the witch revenge streaming on amazon prime in telugu and jiohotstar the witch revenge ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సైనికులపై రివేంజ్ తీర్చుకునే మంత్రగత్తె.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇలాంటి ఓటీటీ హారర్ మూవీ అస్సలు చూసిండరు!

సైనికులపై రివేంజ్ తీర్చుకునే మంత్రగత్తె.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇలాంటి ఓటీటీ హారర్ మూవీ అస్సలు చూసిండరు!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో ఎన్నడూ చూడనటువంటి హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమానే ది విచ్ రివేంజ్. సైనికులపై పగ తీర్చుకునే మంత్రగత్తె కథతో ది విచ్ రివేంజ్ రెండు ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకదాంట్లో ఏకంగా నాలుగు భాషల్లో ది విచ్ రివేంజ్ ఓటీటీ రిలీజ్ అయింది.

సైనికులపై రివేంజ్ తీర్చుకునే మంత్రగత్తె.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇలాంటి ఓటీటీ హారర్ మూవీ అస్సలు చూసిండరు!

ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలను చూసి ఉంటారు. కుప్పలుతెప్పలుగా విభిన్నమైన కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కథా, కథనాలతో మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే జోనర్స్‌లలో హారర్ ఒకటి.

అస్సలు చూసిండరు

ఇలాంటి హారర్ థ్రిల్లర్ జోనర్‌కు ఫాంటసీ, కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ వంటి వివిధ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను వచ్చాయి. అయితే, ఎప్పుడు ఎక్కడ చూడని హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇలాంటి ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాను మాత్రం ఇప్పటివరకు అస్సలు చూసి ఉండరు.

సైనికుల మీద రివేంజ్

ఆ హారర్ థ్రిల్లర్ సినిమానే ది విచ్ రివేంజ్. ఓ మంత్రగత్తె పగ అని దీనర్థం. టైటిల్‌కు తగినట్లుగానే సినిమా కథ ఉంటుంది. అయితే, ఆ మంత్రగత్తె సాధారణమైన మనుషుల మీద కాకుండా ఏకంగా సైనికుల మీద రివేంజ్ తీర్చుకుంటుంది. ఓ ఆర్మీపై పగబట్టి మంత్రగత్తెగా మారి వారిని మట్టుబెట్టుతుంది.

హారర్ థ్రిల్లర్‌కు వార్

వార్ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ వంటి డిఫరెంట్ జోనర్‌లో ది విచ్ రివేంజ్ తెరకెక్కింది. ది విచ్ రివేంజ్ మూవీ 2024 ఆగస్ట్ 22న ఉక్రేయిన్ దేశంలో విడుదలైంది. ఆండ్రీ కొలెస్నిక్ దర్శకత్వం వహించారు. అయితే, ది విచ్ రివేంజ్ ఉక్రేయిన్ భాషలో తెరకెక్కింది. దీనికి ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.3 రేటింగ్ మాత్రమే వచ్చింది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ఇక రెండు ఓటీటీల్లో ది విచ్ రివేంజ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో కేవలం హిందీ భాషలో ది విచ్ రివేంజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏకంగా నాలుగు భాషల్లో ది విచ్ రివేంజ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్, హిందీ, తమిళంతోపాటు తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్‌లో ది విచ్ రివేంజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక్కొక్కరిని మట్టుబెడుతూ

ఇక ది విచ్ రివేంజ్ స్టోరీ విషయానికొస్తే.. 2022 ఫిబ్రవరిలో ఉక్రేయిన్‌పై రష్యా దాడి చేస్తుంది. మరోవైపు కోనోటాప్‌కు చెందిన ఒలెనా, ఆండ్రీ ఇద్దరు లవర్స్ రొమాంటిక్‌గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుందామనుకుంటారు. కట్ చేస్తే మంత్రగత్తెగా మారిన ఒలెనా ఉక్రేయిన్ సైనికులను ఒక్కొక్కరిని మట్టుబెడుతుంది.

ట్విస్టులు

వారిపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి ఓ వింత దెయ్యంతో ఒళ్లు గగుర్పొడిచేలా చంపిస్తుంది. మరి మంత్రగత్తె ఒలెనాను ఆర్మీ ఎలా ఎదుర్కొంది తన నుంచి సైనికులు ప్రాణాలతో బయటపడ్డారా అసలు ఉక్రేయిన్ సైనికులపై మంత్రగత్తె పగ ఎందుకు పెంచుకుంది అనే విషయాలు తెలియాలంటే జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ది విచ్ రివేంజ్ మూవీని చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం