OTT Horror : వీడియో చూసిన సరిగ్గా వారానికి మరణమే.. వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే..-ott horror thriller the ring movie ott streaming on amazon prime video scariest film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror : వీడియో చూసిన సరిగ్గా వారానికి మరణమే.. వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే..

OTT Horror : వీడియో చూసిన సరిగ్గా వారానికి మరణమే.. వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2025 04:49 PM IST

OTT Horror Thriller: హాలీవుడ్‍లో డిఫరెంట్ కాన్సెప్టులతో హారర్ చిత్రాలు వచ్చాయి. వీడియో టేప్ చూసిన వారు సరిగ్గా వారానికి చనిపోయే మిస్టరీతో ఓ మూవీ రూపొందింది. ఈ చిత్రం వణికించేలా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉందంటే..

OTT Horror Thriller: వీడియో చూస్తే వారానికి చావే! వణికించే హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
OTT Horror Thriller: వీడియో చూస్తే వారానికి చావే! వణికించే హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

హారర్ చిత్రాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. భయపెడుతూ థ్రిల్ కలిగించే ఈ జానర్ సినిమాలను చాలా మంది ఇష్టపడతారు. ఉత్కంఠగా ఉండే ఈ చిత్రాలను చూసేందుకు ఇష్టపడతారు. హాలీవుడ్‍లో డిఫరెంట్ కాన్సెప్టులతో హారర్ సినిమాలు రూపొందాయి. హారర్ జానర్‌లో కొన్ని చిత్రాలు క్లాసిక్‍లుగా నిలిచాయి. అలాంటి మూవీనే ‘ది రింగ్’. ప్రేక్షకులను వణికించేలా ఈ చిత్రంలో హారర్ ఎలిమింట్స్, థ్రిల్స్ ఉంటాయి. హారర్ సినిమా చూడాలని ఉంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇవే..

yearly horoscope entry point

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..

ది రింగ్ చిత్రం భారత్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్‍తో పాటు కొన్ని విదేశీ భాషల్లో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. జియో సినిమా ఓటీటీలో ది రింగ్ మూవీ ఇంగ్లిష్‍తో పాటు హిందీ ఆడియోల్లో స్ట్రీమింగ్‍కు ఉంది.

2002లో వచ్చిన ది రింగ్ చిత్రంలో నవోమీ వాట్స్, మార్టిన్ హెండెర్సన్, డేవిడ్ డోర్ఫమన్, చేజ్, బ్రియాన్ కోక్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి గోరే వెర్బిన్‍స్కీ దర్శకత్వం వహించారు. విభిన్నమైన స్టోరీ పాయింట్‍తో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

కమర్షియల్‍గా సూపర్ హిట్

ది రింగ్ చిత్రం 2002 అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. సుమారు 48 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ మూవీ ఏకంగా 249 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. బడ్జెట్‍తో పోలిస్తే ఐదు రెట్ల కలెక్షన్లను దక్కించుకొని అదరగొట్టింది.

ది రింగ్ చిత్రాన్ని మెక్‍డొనాల్డ్/ పార్కెస్ ప్రొడక్షన్స్, బెండర్ స్పింక్, వెట్రిగో ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలు ప్రొడ్యూజ్ చేశాయి. ఈ చిత్రానికి రాన్స్ జిమ్మర్ సంగీతం అందించగా.. బోజన్ బజెలీ సినిమాటోగ్రఫీ చేశారు.

ది రింగ్ స్టోరీలైన్

ఓ వారం క్రితం ఓ వీడియోటేప్ చూసిన క్యాటీ (అంబర్ తంబ్లీన్) అనే బాలిక సరిగ్గా ఏడు రోజులకు చనిపోతుంది. అంతకు ముందు కూడా ఆ వీడియోటేప్ చూసిన కొందరు వారానికే మృతి చెంది ఉంటారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని, మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని జర్నలిస్ట్ అయిన క్యాటీ సోదరి రేచల్ (నవోమీ వాట్స్) నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వీడియో టేప్‍లో ఏముంది? దాన్ని చూసిన వారు సరిగ్గా వారానికే చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీని రేచల్ ఛేదించిందా అనే అంశాల చుట్టూ ది రింగ్ చిత్రం సాగుతుంది. ఈ మూవీని ప్రైమ్ వీడియో, జియోసినిమా ఓటీటీల్లో చూసేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం