OTT Horror Movie: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott horror thriller telugu horror movie kalinga to stream on aha video from october 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Horror Movie: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 07:37 PM IST

OTT Horror Movie: తెలుగు హారర్ మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఆహా వీడియో సోమవారం (సెప్టెంబర్ 30) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న లేటెస్ట్ తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Horror Movie: తెలుగు హారర్ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. త్వరలోనే ఓ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు కళింగ. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమాకు ఆడియెన్స్ నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. అయితే హారర్ జానర్ సినిమాలు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.

కళింగ ఓటీటీ రిలీజ్ డేట్

ఆహా వీడియో ఓటీటీలోకి కళింగ అనే హారర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. "అక్కడికి పోవడమే గానీ రావడం ఉండదు.. కళింగ ప్రీమియర్ అక్టోబర్ 4న మీ ఆహాలో" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

దీనికి మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా యాడ్ చేసింది. ఆ లెక్కన కళింగ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ఈ వీకెండ్ లోనే కానుంది.

కళింగ మూవీ ఎలా ఉందంటే?

కళింగ మూవీలో ధృవవాయు హీరోగా నటించడమే కాదు డైరెక్ట్ కూడా చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైంది. ప్రగ్యానయన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఇక ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే.. క‌ళింగ ఊరి పొలిమేర‌ను దాటి అడ‌విలోకి వెళ్లిన వాళ్లు ఎవ‌రూ ప్రాణాల‌తో తిరిగొచ్చిన దాఖ‌లాలు ఉండ‌వు.

ఆ ఊరికి చెందిన లింగ (ధృవ‌వాయు) ఓ అనాథ‌. సారాకాస్తూ త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. ఆ ఊరికే చెందిన ప‌ద్దును (ప్ర‌గ్యాన‌య‌న్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు లింగ‌. కానీ ప‌ద్దు తండ్రి (ముర‌ళీధ‌ర్‌గౌడ్‌) మాత్రం వారి ప్రేమ‌కు అడ్డు చెబుతాడు. ఊరిపెద్ద (ఆడుకాలం న‌రేన్‌) వ‌ద్ద త‌న‌ఖాలో ఉన్న లింగ పొలం విడిపించుకుంటేనే పెళ్లి జ‌రిపిస్తాన‌ని కండీష‌న్ పెడ‌తాడు.

త‌న త‌మ్ముడు బ‌లితో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా లింగ‌కు అత‌డి పొలం బ‌దులు అడ‌వి ద‌గ్గ‌ర‌లోని భూమిని రాసిస్తాడు ఊరిపెద్ద‌. త‌మ పొలం కోసం పొలిమేర దాటి అడ‌విలోకి వెళ్లిన లింగ‌కు, అత‌డి స్నేహితుడికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? ప‌ద్దుకు లింగ‌ను దూరం చేయాల‌ని ఊరి పెద్ద ఎందుకు అనుకున్నాడు?

లింగ‌తో బ‌లికి ఉన్న గొడ‌వ‌ల‌కు కార‌ణం ఏమిటి? క‌ళింగ రాజు సంప‌ద అడ‌విలో ఎక్క‌డ ఉంది? ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏమిటి? అసుర భ‌క్షి వెన‌కున్న మిస్ట‌రీని లింగ ఎలా ఛేదించాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

క‌ళింగ క‌థ‌లోని ప్ర‌ధాన‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌ను వాయిస్ ఓవ‌ర్‌తోనే చెప్పించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. ల‌వ్‌స్టోరీని రొటీన్‌గా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కొన్ని చోట్ల లాజిక్స్‌తో సంబంధం లేకుండా క‌థ సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. హార‌ర్ డోస్ త‌గ్గిన‌ట్లుగా అనిపిస్తుంది.

Whats_app_banner