OTT Horror Thriller Movie: ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వస్తున్న హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Horror Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో హారర్ థ్రిల్లర్ మూవీ ఫ్రీగా అందుబాటులోకి వస్తోంది. ఇన్నాళ్లూ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇక నుంచి జియో సినిమాలో సబ్‌స్క్రైబర్లందరూ చూడొచ్చు.
OTT Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ జానర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ఇంగ్లిష్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు ది వాచర్స్ (The Watchers). భయపెడుతూనే మంచి థ్రిల్ అందించే ఈ సినిమా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఇండియాలో పూర్తి స్థాయిలో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. కొన్నాళ్లుగా ది వాచర్స్ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.
ది వాచర్స్ ఓటీటీ రిలీజ్ డేట్
హారర్ థ్రిల్లర్ మూవీ ది వాచర్స్ గురువారం (నవంబర్ 14) నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. 2021లో ఏఎం షైన్ రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇషానా నైట్ శ్యామలన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు.
ఐర్లాండ్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. అక్కడి ఓ అడవిలోని ఇంట్లో బంధీలుగా మిగిలిపోయిన మీనా అనే ఆర్టిస్ట్ సహా మరి కొందరు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రిలీజైంది. 30 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 33 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ది వాచర్స్ మూవీ ఏంటంటే?
ది వాచర్స్ మూవీలో డకోటా ఫానింగ్, జార్జీనా క్యాంప్‌బెల్, ఓల్వెన్ ఫౌరీ, ఒలివర్ ఫిన్నెగన్ లాంటి వాళ్లు నటించారు. ఇందులో ఆ మీనా ఆర్టిస్ట్ పాత్రలో డకోటా ఫానింగ్ నటించింది. ఆ ఇంట్లో బంధీలుగా ఉన్న వాళ్లకు వింత అనుభవాలు ఎదురవుతాయి. మీనాతోపాటు అప్పటికే మరో ముగ్గురు కొత్త వ్యక్తులు అక్కడ ఉంటారు. తాము కూడా అలాగే ఇక్కడ చిక్కుకుపోయామని వాళ్లు చెబుతారు.
ఆ అడవిలోకి వెళ్లిన వాళ్లు ఎవరూ వెనక్కి వచ్చిన దాఖలాలు ఉండవు. అక్కడి ఓ చెట్టు దగ్గరికి వెళ్లగానే వాళ్లు వెళ్లే వెహికిల్స్ బ్రేక్ డౌన్ అవుతుంటాయి. మీనా వెహికిల్ కూడా అలాగే అవుతుంది. అక్కడి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న సమయంలో దూరంగా కనిపించే ఓ బంకర్ నుంచి అక్కడికి రావాల్సిందిగా అరుపులు వినిపిస్తాయి. అందులోకి వెళ్లిన వాళ్లు బంధీలుగా మిగిలిపోతారు.
అసలు ఆ వాచర్స్ ఎవరు? మనుషులను వాళ్లు బంధీలుగా ఎందుకు చేసుకుంటున్నారు? చివరికి అక్కడ చిక్కుకున్న వాళ్ల పరిస్థితి ఏమవుతుంది అన్నది ఈ ది వాచర్స్ మూవీలో చూడొచ్చు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జియో సినిమా ద్వారా అందుబాటులోకి వస్తోంది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను కేవలం నెలకు రూ.29 చెల్లిస్తే పొందవచ్చు. దీనిద్వారా ఆ ఓటీటీలోని ప్రీమియం కంటెంట్ మొత్తం చూసే వీలుంటుంది.