సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రం ఈ ఏడాది మేలో థియేటర్లలో రిలీజైంది. బాలీవుడ్‍లో వరుస సినిమాలు చేస్తున్న అదా శర్మ.. ఈ మూవీతో టాలీవుడ్‍లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో అదా ప్రధాన పాత్రలు పోషించారు. సీడీ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.
సీడీ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (అక్టోబర్ 26) ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఐదు నెలలకు ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
సీడీ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు అదా శర్మ. ఇంటెన్స్ యాక్టింగ్‍తో అదరగొట్టారు. ఈ చిత్రంలో విశ్వంత్ దుడ్డంపూడి, మహేశ్ విట్టా, భరణి శంకర్, రోహిణి కీరోల్స్ చేశారు. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా సస్పెన్స్‌తో రూపొందించారు డైరెక్టర్ కృష్ణ. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సక్సెస్ సాధించలేకపోయింది.
సీడీ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఎస్ఎస్‍సీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై గిరిధర్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సతీశ్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా.. సత్య గిడుటూరి ఎడిటింగ్ చేశారు.
దెయ్యాలు అంటే విపరీతమైన భయం ఉండే సిద్ధు (విశ్వంత్) ఓ రోజు ఒంటరిగా డెవిల్ అనే హారర్ సినిమా చూస్తాడు. ఆ తర్వాతి నుంచి ఆ చిత్రంలోని దెయ్యం తనను వెంటాడుతోందని, చంపేందుకు వస్తోందని భయపడుతుంటాడు. మరోవైపు రక్ష (అదా శర్మ) వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తారు. అయినా కిడ్నాలు ఆపదు. ఈ క్రమంలో సిద్ధును వెతుక్కుంటూ రక్ష వస్తుంది. రక్ష, సిద్ధు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నిజంగా కిడ్నాప్‍లను రక్షనే చేస్తోందా? రక్ష మిస్టరీ ఏంటి? అనే విషయాలు సీడీ మూవీలో ఉంటాయి.
లిటిల్ హార్ట్స్ చిత్రం ఈ వారంలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అక్టోబర్ 24న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా చేశారు. మలయాళంలో ఈ ఏడాది జూన్‍లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. లిటిల్ హార్ట్స్ మూవీకి ఆంటో జోస్ పెరీరా, అబీ తీసా పౌల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సాండ్రా థామస్ ప్రొడక్షన్స్ పతాకంపై సాండ్రా థామస్, విల్సన్ థామస్ ప్రొడ్యూజ్ చేశారు. రెండు లవ్ స్టోరీల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.