OTT Horror Series: ఓటీటీలోకి మళ్లీ వస్తున్న వణికించే హారర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
OTT Horror Series: ఓటీటీలోకి ఓ వణికించే హారర్ మళ్లీ వస్తోంది. 1990ల్లో ఎంతో పాపులర్ అయిన హారర్ ఆంథాలజీ టీవీ సిరీస్ ది జీ హారర్ షో త్వరలో రాబోతున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
OTT Horror Series: ఒకప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించిన ఎన్నో షోలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. ఈసారి ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శక్తిమాన్ షో మళ్లీ వస్తున్నట్లు అనౌన్స్ చేయగా.. సోనీ టీవీ పాపులర్ షో సీఐడీ, దూరదర్శన్ షో ఫౌజీ కూడా మళ్లీ వస్తున్నాయి. తాజాగా ది జీ హారర్ షో కూడా తిరిగి రానున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
ది జీ హారర్ షో మళ్లీ..
1990ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన ఎన్నో షోస్ మళ్లీ వరుస కడుతున్నాయి. మనల్ని మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అలా వస్తున్నది ది జీ హారర్ షో. ఇదొక ఆంథాలజీ హారర్ షో.
"భయం ముగిసిపోవడం లేదు.. మొదలవుతోంది.. సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఓ చిన్న టీజర్ ను ఆదివారం (నవంబర్ 17) జీ5 ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. ది జీ హారర్ షో జీ5 ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
ఏంటీ ది జీ హారర్ షో?
ది జీ హారర్ షో 1993 నుంచి 2001 వరకు జీ టీవీలో టెలికాస్ట్ అయింది. ఈ హారర్ జానర్ షో 1990ల్లో ఎక్కువ మంది చూసినా, సుదీర్ఘంగా సాగిన షోలలో ఒకటిగా పేరుగాంచింది. మొత్తంగా 350 ఎపిసోడ్ల సిరీస్ ఇది. ఇండియన్ హారర్ సినిమాకు కేరాఫ్ అయిన ది రామ్సే బ్రదర్స్.. ఈ జీ హారర్ షోని ప్రజెంట్ చేశారు. ఇందులో భాగంగా కొందరు భయానక వ్యక్తులు, నమ్మలేని నిజాలు, శాపగ్రస్తమైన ఇళ్ల గురించి ఈ షోలో చూపించేవారు.
ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో భయానకమైన ఘటన గురించి వివరించేది. దీనికి అజిత్ సింగ్, ఉత్తమ్ సింగ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత వణుకు పుట్టిస్తుంది. ఈ ది జీ హారర్ షో హిందీలో టెలికాస్ట్ అయింది. చిన్న చిన్న హారర్ కథల సమాహారమే ఇది. ఇండియన్ టీవీ చరిత్రలో బాగా పేరుగాంచిన తొలి హారర్ షో ఇది. తొలిసారి ఆగస్ట్ 9, 1993లో ఈ షోని టెలికాస్ట్ చేశారు. చివరి ఎపిసోడ్ 2001లో వచ్చింది. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్లకు జీ హారర్ షో ఓటీటీ వేదికగా తిరిగి రాబోతోంది. మరి ఈసారి ఈ షో ఎలా భయపెడుతుందో చూడాలి.