OTT Horror: గాల్లో పక్షి ఆకారం చూస్తే చస్తారు- ఒకే ఓటీటీలో 2 హారర్ థ్రిల్లర్స్- 13 భాషల్లో- నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్!-ott horror science fiction thrillers bird box and bird box barcelona ott streaming on netflix in 13 above languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: గాల్లో పక్షి ఆకారం చూస్తే చస్తారు- ఒకే ఓటీటీలో 2 హారర్ థ్రిల్లర్స్- 13 భాషల్లో- నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్!

OTT Horror: గాల్లో పక్షి ఆకారం చూస్తే చస్తారు- ఒకే ఓటీటీలో 2 హారర్ థ్రిల్లర్స్- 13 భాషల్లో- నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

OTT Horror Science Fiction Thrillers: ఓటీటీలో హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు అలరిస్తున్నాయి. ఒక్క ఒటీటీలోనే ఏకంగా 13 భాషల్లో బర్డ్ బాక్స్, బర్డ్ బాక్స్ బార్సిలోనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. గాల్లో కనిపించే పక్షి ఆకారం చూసి అంతా చచ్చిపోతుంటారు. మరి ఆ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

గాల్లో పక్షి ఆకారం చూస్తే చస్తారు- ఒకే ఓటీటీలో 2 హారర్ థ్రిల్లర్స్- 13 భాషల్లో- నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్!

OTT Horror Science Fiction Thrillers: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. భాషా బేధం లేకుండా ఎన్నో చిత్రాలు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ఇక ప్రేక్షకులు అధికంగా చూసే జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ముందు వరుసలో ఉంటాయి.

హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్

ఆ హారర్ థ్రిల్లర్స్‌కు ఇతర అంశాలు జోడించి సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో ఒకటే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. హారర్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రెండు సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఆ రెండు సినిమాలే బర్డ్ బాక్స్ అండ్ బర్డ్ బాక్స్ బార్సిలోనా.

2018లో అమెరికన్ పోస్ట్ అపొకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిందే బర్డ్ బాక్స్. సుసన్నె బెయిర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19.8 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. బర్డ్ బాక్స్ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదల చేసి ఉంటే.. సుమారుగా 98 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసేదని నిపుణులు అంచనా వేశారు.

282 గంటల మిలియన్ వ్యూస్

బర్డ్ బాక్స్ ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.6 రేటింగ్ సొంతం చేసుకుంది. కానీ, 2018లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా బర్డ్ బాక్స్ పేరు తెచ్చుకుంది. అలాగే, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మొదటి 28 రోజుల్లో 282.02 మిలియన్ గంటల వ్యూవర్‌షిప్ సాధించింది.

బర్డ్ బాక్స్‌ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తో స్పిన్ ఆఫ్ సీక్వెల్‌ను తెరకెక్కించారు మేకర్స్. 2023 సంవత్సరంలో బర్డ్ బాక్స్ బార్సిలోనా టైటిల్‌తో సీక్వెల్‌ను డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. అయితే, బర్డ్ బాక్స్ బార్సిలోనా మొదటి మూవీ తెచ్చుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. ఈ సీక్వెల్‌ను ఫస్ట్ మూవీ డైరెక్టర్ కాకుండా అలెక్స్ పాస్టర్, డేవిడ్ పాస్టర్ ఇద్దరు దర్శకత్వం వహించారు.

ఆత్మహత్యలు చేసుకోవడమే

ఇక ఈ సినిమా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 5.3 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌లో ఉన్న నటీనటులు రెండో భాగంలో కనిపించరు. ఇక రెండు సినిమాలు అయితే ఒక కాన్సెప్ట్‌తోనే సాగుతాయి. అమెరికాలోని ఓ సిటీలో మనుషులందరూ సడెన్‌గా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. బిల్డింగ్స్ నుంచి దూకడం, కార్లు యాక్సిడెంట్ చేయడం వంటివి చేస్తూ చస్తూ ఉంటారు.

అయితే, వారందరికి గాలిలో ఒక పక్షి ఆకారంలో నీడ కనిపిస్తుంది. అది చూసి అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటారు. దాని నుంచి తప్పించుకోడానికి కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతారు. కానీ, వాయిస్‌తో వారి గంతలు తీసేందుకు ఆ ఆకారం ప్రయత్నిస్తుంది. ఆ ఆకారానికి కొంతమంది హెల్ప్ చేసేవాళ్లు కూడా ఉంటారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఇలాంటి సమయంలో కొంతమంది ఎలా బతికారన్నదే ఈ రెండు సినిమాల స్టోరీ. ఈ రెండు సినిమాలో నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో 13 భాషల్లో బర్డ్ బాక్స్, బర్డ్ బాక్స్ బార్సిలోనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇంగ్లీష్, బ్రెజిలియన్ పోర్చూగీస్, యూరోయన్ పోర్చూగీస్, ఫ్రెంచ్, జెర్మన్, ఇటాలియన్, జపనీస్, పొలిష్, రష్యన్, స్పానిష్, టర్కిష్, ఉక్రేనియన్, వియత్నామీస్ ఇంకా తదితర భాషల్లో బర్డ్ బాక్స్, బర్డ్ బాక్స్ బార్సిలోనా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం