OTT Horror Movies Release Telugu This Week: ఓటీటీ ఆడియెన్స్‌కు ఇష్టమైన జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇలాంటి హారర్ థ్రిల్లర్స్ జోనర్‌లో కామెడీ, ఫాంటరీ, జాంబీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఏకంగా 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో రెండు ఒకేరోజున ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ హారర్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో కామెడీ, అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమా టుక్ టుక్. సాన్వి మేఘన, నిహాల్ కోదాటి, కోర్ట్ హీరో హర్ష్ రోషన్, సలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన టుక్ టుక్ ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం 15 రోజుల్లోనే టుక్ టుక్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ రాక్షస. కూతురు కాపాడుకునే ఓ తండ్రి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు లోహిత్ హెచ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన రాక్షస ఓటీటీలోకి వచ్చేసింది.
ఇవాళ (ఏప్రిల్ 11) సన్ ఎన్ఎక్స్‌టీలో రాక్షస ఓటీటీ రిలీజ్ అయింది. కన్నడతోపాటు తెలుగు భాషలో రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి రాక్షస మంచి ఆప్షన్.
నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ డ్రామా చిత్రం ఛోరీ 2. బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఛోరీ సినిమా 2021లో మంచి హిట్ సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఛోరీ 2 మూవీని డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.
ఏప్రిల్ 11 అంటే నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఛోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు భాషల్లో ఓటీటీ రిలీజ్ అయిన ఛోరీ 2 తన బిడ్డను కాపాడుకునే తల్లి చుట్టూ తిరుగుతుంది. ఛోరీ 2, రాక్షస రెండు హారర్ సినిమాలు ఇవాళ అంటే ఒకేరోజు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
మొట్టమొదటి సీ అడ్వెంచర్ ఫాంటసీ హారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం కింగ్‌స్టన్. మార్చి 7న తెలుగు, తమిళంలో థియేటర్లలో విడుదలైన కింగ్‌స్టన్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్, దివ్య భారతి హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఏప్రిల్ 13 నుంచి తెలగు, తమిళ భాషల్లో జీ5లో కింగ్‌స్టన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
హారర్, థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, అడ్వెంచర్ వంటి ఏడు ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన పాపులర్ వెబ్ సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అజ్. 2023లో వచ్చిన ఈ సిరీస్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండేళ్లకు దీనికి సీక్వెల్ రానుంది. జాంబీల నుంచి తప్పించుకునే తండ్రీకూతుళ్ల వయసు ఉండే ఇద్దరు అపరిచితుల వ్యక్తుల ప్రయాణంగా ఈ సిరీస్ సాగుతుంది.
జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 14 నుంచి ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ వంటి ఐదు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం