OTT Horror Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న వణుకు పుట్టించే హారర్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే..
OTT Hollywood Horror Movie: ఓటీటీలోకి మరో వణుకు పుట్టించే హాలీవుడ్ హారర్ మూవీ వస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కేవలం 15 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
OTT Hollywood Horror Movie: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ వణుకు పుట్టించే హారర్ మూవీ రాబోతోంది. ఆగస్ట్ 16న ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోనే రిలీజైన ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు ది డెలివరెన్స్. అకాడెమీ అవార్డ్ కు నామినేట్ అయిన డైరెక్టర్ లీ డేనియల్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హారర్ మూవీ ప్రియులను అలరించడానికి వస్తోంది.
ది డెలివరెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్
ది డెలివరెన్స్ ఓ హాలీవుడ్ హారర్ మూవీ. ఇది ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన సినిమా. సస్పెన్స్, హారర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది. భూతవైద్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆండ్రా డే, గ్లెన్ క్లోజ్, మోనిక్, ఆన్‌జాన్యూ ఎలిస్, కాలెబ్ మెక్‌లాలిన్ లాంటి వాళ్లు నటించారు.
ది డెలివరెన్స్ మూవీ కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఈ నెల 16న రిలీజైంది. అయితే రెండు వారాల్లోనే అంటే శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన హారర్ మూవీ కావడంతో ఓటీటీ ప్రేక్షుకులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
ది డెలివరెన్స్ మూవీ కథ ఇదీ..
ది డెలివరెన్స్ మూవీ లటోయా అమోన్స్, ఆమె కుటుంబం ఎదుర్కొన్న భయానక ఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాకు మొదట డెమన్ హౌజ్ అనే పెట్టినా.. తర్వాత ది డెలివరెన్స్ అని మార్చారు. ఓ కొత్త ఇంట్లోకి వెళ్లిన ఆమె కుటుంబం.. అక్కడ అతీత శక్తుల ఉనికితో వణికిపోతుంది.
ఆ శక్తుల నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఆ ఒంటరి తల్లి చేసే ప్రయత్నమే ఈ ది డెలివరెన్స్ మూవీ. మూవీ ట్రైలరే ఆసక్తి రేపేలా సాగింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఎన్నో హారర్ సినిమాల జాబితాలో తాజాగా ది డెలివరెన్స్ కూడా చేరింది.
ఆగస్ట్ 16న థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకులను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోనట్లు తెలుస్తోంది. ఐఎండీబీలో ది డెలివరెన్స్ మూవీకి 5.4 రేటింగ్ మాత్రమే ఉంది. ఇక రివ్యూ అగ్రిగేటర్ రోటెన్ టొమాటోస్ లోనూ ఈ సినిమాకు 50 శాతం మాత్రమే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.