OTT Horror Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత తెలుగులోనూ వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ.. రూ.3 వేల కోట్ల వసూళ్లతో..
OTT Horror Movie: ఓటీటీలోకి ఇప్పుడో బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ వస్తోంది. ఈ హాలీవుడ్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.
OTT Horror Movie: సైన్స్ ఫిక్షన్ కు హారర్ తోడైతే ఎలా ఉంటుంది? ఏలియన్: రొములస్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. మూడు నెలల కిందట ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. 8 కోట్ల డాలర్ల (సుమారు రూ.675 కోట్లు) బడ్డెట్ తో రూపొందిన ఈ హారర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 35 కోట్ల డాలర్లు (సుమారు రూ.3 వేల కోట్లు) వసూలు చేయడం విశేషం.
ఏలియన్: రొములస్ ఓటీటీ రిలీజ్ డేట్
ఏలియన్: రొములస్.. ఇప్పటికే హాలీవుడ్ లో వచ్చిన ఎన్నో ఏలియన్ సినిమాల్లో ఇదీ ఒకటి. సైన్స్ ఫిక్షన్ కు కాస్త హారర్ జోడించి తీసుకొచ్చిన ఈ సినిమా కూడా గతంలో వచ్చిన ఏలియన్ మూవీస్ లాగే బ్లాక్ బస్టర్ అయింది. ఆగస్ట్ 16న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలల తర్వాత నవంబర్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వస్తుండటంతో ఓటీటీలోనూ ఈ సై-ఫి హారర్ జానర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏలియన్: రొములస్ మూవీ స్టోరీ ఇదీ..
ఏలియన్ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన సినిమా ఇది. 1979లో వచ్చిన ఏలియన్, 1986లో వచ్చిన ఏలియన్స్ మూవీ తర్వాత ఇప్పుడీ ఏలియన్: రొములస్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫెడె అల్వారెజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
1986లో వచ్చిన ఏలియన్స్ తర్వాత ఇదే బెస్ట్ ఏలియన్ మూవీ అని క్రిటిక్స్ కూడా స్పష్టం చేశారు. దీంతో బాక్సాఫీస్ వసూళ్లలో మూవీ ఇరగదీసింది. ఏకంగా 35 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఓ పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచి తమకు పనికి వచ్చే వస్తువులను సేకరిస్తున్న సమయంలో విశ్వంలోని ఏలియన్స్ ఓ వింత జీవి రూపంలో వచ్చి వాళ్లపై దాడి చేస్తుంది.
వాటి నుంచి ఈ కాలనిస్ట్స్ తప్పించుకున్నారా లేదా అన్నదే ఈ ఏలియన్: రొములస్ మూవీ. ఏలియన్ ఫ్రాంఛైజీల్లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ మూవీకి క్రిటిక్స్ రేటింగ్ ఇచ్చారు. ఐఎండీబీలో 7.2 రేటింగ్, రోటెన్ టొమాటోస్ లో 80 శాతం స్కోరుతో ఈ మూవీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ ఏలియన్: రొములస్ మూవీ నవంబర్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.