OTT Friday Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. రూ.800 కోట్ల వసూళ్లతో..
OTT Friday Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన ఈ సినిమాలు అన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండగా.. ఇవి బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.800 కోట్లు వసూలు చేశాయి.
OTT Friday Releases: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వీకెండ్ పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఒకే రోజు మూడు భాషలకు చెందిన మూడు పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో ఒకటి తెలుగు మూవీ దేవర కాగా.. మరొకటి తమిళ మూవీ వేట్టయన్, మలయాళ మూవీ ఏఆర్ఎం కావడం విశేషం. పైగా ఇవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ మూవీస్ ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైకి వస్తున్నాయో ఒకసారి చూద్దాం.
దేవర ఓటీటీ రిలీజ్ డేట్
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ ఊహించినట్లే ఈ శుక్రవారం (నవంబర్ 8) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఒక్క హిందీ వెర్షన్ తప్ప తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు ఆ రోజు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.
హిందీ వెర్షన్ నవంబర్ 22న రానున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఆరు వారాల తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది.
వేట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్లు నటించిన తమిళ మూవీ వేట్టయన్ కూడా ఈ శుక్రవారమే (నవంబర్ 8) ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
తమిళంతోపాటు తెలుగులోనూ వస్తోంది. అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. వేట్టయన్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ లాంటి వాళ్లు నటించారు.
ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వార్ డ్రామా థియేటర్లలో రిలీజైన 57 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు వస్తోంది. తెలుగులోనూ ఏఆర్ఎం స్ట్రీమింగ్ కానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయొచ్చు.