OTT Family Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?-ott family drama maa nanna superhero ott release date sudheer babu movie to stream on zee5 from 15th november ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT Family Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Nov 11, 2024 01:11 PM IST

OTT Family Drama: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా వచ్చేస్తోంది. సుధీర్ బాబు నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTT Family Drama: ఓటీటీలోకి టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మా నాన్న సూపర్ హీరో రాబోతోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రీకొడుకుల మధ్య రిలేషన్షిప్ ను మనసుకు హత్తుకునేలా తీసినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించలేకపోయింది.

మా నాన్న సూపర్ హీరో ఓటీటీ రిలీజ్ డేట్

సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఇప్పుడీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ సినిమాను వచ్చే శుక్రవారం (నవంబర్ 11) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి జీ5 ఓటీటీ మంచి మొత్తమే చెల్లించినట్లు సమాచారం. అంతకుముందు హరోం హర అనే యాక్షన్ డ్రామాతో వచ్చినా సక్సెస్ సాధించని సుధీర్ బాబు.. ఈ మా నాన్న సూపర్ హీరోపై ఆశలు పెట్టుకున్నా.. అదీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

మా నాన్న సూపర్ హీరో ఎలా ఉందంటే?

టాలీవుడ్‌, బాలీవుడ్ తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో తండ్రీకొడుకుల అనుబంధం అన్న‌ది బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాగా పేరుప‌డింది. ఈ కాన్సెప్ట్‌తో ఇటీవ‌ల వ‌చ్చిన బాలీవుడ్ మూవీ యానిమ‌ల్ ఏకంగా వెయ్యి కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో తండ్రీకొడుకుల ఎమోష‌న్‌తో స్టార్ హీరోలు సినిమాలు చేసి అద్భుత విజ‌యాల్ని అందుకున్నారు. మా నాన్న సూప‌ర్ హీరో మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఈ జోన‌ర్‌ను ట‌చ్ చేశాడు హీరో సుధీర్ బాబు.

దూర‌మైన త‌న కొడుకు ప్రేమ కోసం ప‌రిత‌పించే సొంత తండ్రి.. ద‌గ్గ‌రున్న కొడుకును అనుక్ష‌ణం ద్వేషించే ద‌త్త‌త తీసుకున్న‌ తండ్రి.. వారి మ‌ధ్య‌ ఓ కొడుకు జీవితం ఎలా సాగింద‌నే అంశాల‌తో ఎమోష‌న‌ల్ డ్రామాగా ద‌ర్శ‌కుడు మా నాన్న సూప‌ర్ హీరో మూవీని తెర‌కెక్కించాడు. ఆర్థిక అవ‌స‌రాలు మ‌నిషిని ఎలా స్వార్థ‌ప‌రుడిగా మారుస్తాయ‌నే చిన్న సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు. తండ్రీకొడుకుల ఎమోష‌న్‌తో పాటు క్రైమ్, ల‌వ్ ఎలిమెంట్స్‌కు క‌థ‌లో ద‌ర్శ‌కుడు చోటిచ్చాడు.

న‌టుడిగా సుధీర్‌బాబును ఓ మెట్టు ఎక్కించిన మూవీ ఇది. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ ఎమోష‌న‌ల్ రోల్‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. దూర‌మైన కొడుకును క‌లుసుకోవాల‌ని ఆరాట‌ప‌డే తండ్రి పాత్ర‌లో సాయిచంద్ ఒదిగిపోయాడు. షాయాజీ షిండే యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది. ఆర్ణ‌, ఆమ‌నితోపాటు మిగిలిన పాత్ర‌ల‌కు క‌థ‌లో పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. అభిలాష్ కంక‌ర క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా మొద‌టి మూవీతో మెప్పించాడు.

Whats_app_banner