OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!-ott direct films this week the mehta boys and mrs to streaming on amazon prime video zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!

OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2025 09:50 AM IST

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రెండు చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రెండు చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. కుటుంబంతో కలిసి చూసేలా ఫ్యామిలీ డ్రామాతో ఉండనున్నాయి. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానునున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!
OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం కూడా కొన్ని చిత్రాలు అడుగుపెట్టన్నాయి. అయితే, రెండు సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ సబ్జెక్టులతో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. ఈ వీకెండ్‍కు కుటుంబంతో కలిసి ఈ చిత్రాలను చూడొచ్చు. ఇందులో ఓ మూవీ తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. ఈ వారం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న రెండు చిత్రాలు ఏవంటే..

yearly horoscope entry point

ది మెహతా బాయ్స్

ది మెహతా బాయ్స్ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీతో దర్శకుడిగానూ మారారు బొమన్.

తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామా ది మెహతా బాయ్స్ మూవీని తెరకెక్కించారు బొమన్ ఇరానీ. చాలాకాలం దూరమై రిలేషన్ సరిగా లేని తండ్రీకొడుకులు కలిసి మళ్లీ ఉండాల్సి వస్తుంది. వారి మధ్య బంధం బలపడిందా.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ది మెహతా బాయ్స్ మూవీని ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

మిసెస్

మిసెస్ సినిమా కూడా ఫిబ్రవరి 7వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీ కూడా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కే వస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో సాన్య మల్హోత్రా, నిషాంత్ దహియా ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ పాపులర్ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్‍కు హిందీ రీమేక్‍గా మిసెస్ (Mrs.) రూపొందింది.

మిసెస్ చిత్రానికి ఆర్తి కడవ్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే.. ది గ్రేట్ ఇండియన్ కిచెన్‍ కథలో పెద్దగా మార్పులు లేకుండానే రీమేక్ చేసినట్టు అర్థమవుతోంది. కొత్తగా పెళ్లి అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయి ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ మిసెస్ చిత్రం సాగుతుంది. భర్తతో పాటు అత్తింటి వారి ప్రవర్తన, మాటలు, తీరిక లేని ఇంటి పనులతో ఆ అమ్మాయి ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులతో ఈ చిత్రం ఉండనుంది. ఫ్యామిలీతో ఈ చిత్రాన్ని చూడవచ్చు. చాలా మందికి మిసెస్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలైనా రిలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మూవీని ఫిబ్రవరి 7 నుంచి జీ5లో వీక్షించొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం