OTT Crime Thriller: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
OTT Crime Thriller: క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. పోస్టర్ రివీల్ చేసింది. ఈ సిరీస్ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు వస్తుందంటే..

ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్‍లు వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సిరీస్‍లపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుండటంతో క్యూ కట్టేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. అదే ‘క్రైమ్ బీట్’. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా రివీల్ అయింది. ఈ సిరీస్‍లో షకీబ్ సలీం, సబా అజాద్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రైమ్ బీట్ సిరీస్ వివరాలు ఇవే..
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. “జర్నలిస్ట్ అభిషేక్ ఫేమస్ కావాలని ఆశిస్తుంటాడు. ఓ పోలీస్‍తో కలిసి సిటీలో ఓ సీక్రెట్‍ను కనుగొంటాడు. చీఫ్ ఎడిటర్ కూడా సీక్రెట్స్ దాస్తున్నాడని తెలుసుకుంటాడు. క్రైమ్ బీట్ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి జీ5లో ప్రీమియర్ అవుతుంది” అంటూ సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది.
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్‍కు సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ దర్శకత్వం వహించారు. ఓ క్రైమ్ మిస్టరీని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకురావడం, ఈ క్రమంలో ట్విస్టులు, సవాళ్లు ఎదురవడం చుట్టూ ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఈ సిరీస్‍లో షకీబ్, సబా ఆజాద్‍తో పాటు రణ్‍వీర్ షోరే, సాయి తంహనకర్, దనిష్ హుసన్, రాజేశ్ తైలాంగ్, ఆదినాథ్ కఠారే కీలకపాత్రలు పోషించారు.
క్రైమ్ బీట్.. ఓ నిజాయితీ పోలీస్, ఓ ప్రమాదకరమైన క్రిమినల్, ఓ జర్నలిస్టు కలిసి.. ఏదో బ్రేకింగ్ న్యూస్ ప్రిపేర్ చేస్తున్నారంటూ జీ5 వెల్లడించింది. మిస్టరీని కనుగొనేందుకు ప్రయత్నించే జర్నలిస్టు చుట్టూ ఈ సిరీస్ సాగుతుందని టీజర్ ద్వారా తెలిపింది. త్వరలో ట్రైలర్ రానుంది. ఫిబ్రవరి 21 నుంచి క్రైమ్ బీట్ సిరీస్‍ను జీ5 ఓటీటీలో చూసేయవచ్చు.
మిసెస్ స్ట్రీమింగ్
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారంలోనే ‘మిసెస్’ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కు హిందీ రీమేక్‍గా ఈ మూవీ రూపొందింది. మిసెస్ చిత్రానికి ఆర్తి కడవ్ దర్శకత్వం వహించగా.. సాన్య మల్హోత్రా, నిశాంత్ దహియా ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా వివాహమైన అమ్మాయి.. భర్త, అత్తారింటి కుటుంబ సభ్యుల ప్రవర్తన మాటలతో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కోవడం చుట్టూ మిసెస్ మూవీ సాగుతుంది.
సంబంధిత కథనం