OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..-ott crime thriller movie despatch hits 200 million streaming minutes on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

Hari Prasad S HT Telugu
Dec 25, 2024 05:29 PM IST

OTT Crime Thriller Movie: ఓటీటీలో ఇప్పుడో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. నిజానికి ఈ సినిమాకు ఐఎండీబీలో దారుణమైన రేటింగ్స్ నమోదవుతున్నా.. రోజురోజుకూ సినిమాను చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం.

ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..
ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

OTT Crime Thriller Movie: క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓటీటీలో ఉండే డిమాండ్ ఎలాంటిదో తెలుసు కదా. ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరో సినిమా కూడా అదే నిరూపిస్తోంది. డిసెంబర్ 13న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. రెండు వారాల్లోపే 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ సినిమా పేరు డిస్పాచ్. మనోజ్ బాజ్‌పాయీ నటించిన ఈ సినిమాకు మొదటి నుంచీ నెగటివ్ రివ్యూలే వస్తున్నా.. మూవీని మాత్రం చాలా మందే చూస్తున్నారు.

yearly horoscope entry point

డిస్పాచ్ మూవీ ఓటీటీ రికార్డు

ఓటీటీ వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన చాలా వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వీటిలో చాలా వరకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒరిజినల్సే ఉన్నాయి. తాజాగా జీ5 ఓటీటీలో వచ్చిన మరో ఒరిజినల్ మూవీ డిస్పాచ్ (Despatch). మనోజ్ బాజ్‌పాయీ నటించిన ఈ సినిమా తాజాగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"అచ్చూ జాయ్ లాగే ఈ స్టోరీపై మీ ప్రేమ కూడా అన్‌స్టాపబుల్. డిస్పాచ్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ రికార్డు విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో జాయ్ అనే జర్నలిస్టు పాత్రలో మనోజ్ బాజ్‌పాయీ కనిపించాడు.

ఏంటీ డిస్పాచ్ మూవీ స్టోరీ?

డిస్పాచ్ మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్. 2జీ స్కామ్ ను వెలికి తీసే జాయ్ అనే జర్నలిస్టు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అతడు డిస్పాచ్ అనే పత్రికలో పని చేస్తుంటాడు. ఓ హత్య కేసు వెనుక ఉన్న వాళ్లను వెలికి తీసే క్రమంలో అతనికి ఈ 2జీ స్కామ్ గురించి తెలుస్తుంది. రూ.8 వేల కోట్ల విలువైన స్కామ్, దాని వెనుక ఉన్న వాళ్లు ఎవరు అన్నదానిపై గుట్టులాగే పనిలో అతడు పడతాడు.

ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొంటాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అయినా.. మూవీని ప్రజెంట్ చేసిన తీరు మాత్రం చాలా బోరింగా ఉండటంతో ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. మొదటి నుంచీ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అంతేకాదు ప్రేక్షకులు కూడా ఐఎండీబీలో దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. దీంతో డిస్పాచ్ మూవీకి కేవలం 4.7 ఐఎండీబీ రేటింగే నమోదైంది.

ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయీ కూడా బోల్డ్ సీన్లలో నటించాడు. ఓ సీన్లో అయితే పూర్తి నగ్నంగా నటించడం విశేషం. అంతేకాదు ముగ్గురు ఫిమేల్ లీడ్స్ తో లిప్ లాక్ సీన్లలో నటించడం కూడా అభిమానులను షాక్ కు గురి చేసింది. రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాను కాను బెహల్ డైరెక్ట్ చేశాడు. డిస్పాచ్ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు.

Whats_app_banner