OTT Comedy Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న అడల్ట్ కామెడీ మూవీ.. ఆ మిస్సయిన సామాను ఎక్కడ?
OTT Comedy Movie: ఓ అడల్ట్ కామెడీ మూవీ మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. కన్నడలో మంచి హిట్ సాధించిన ఈ నిజ జీవిత ఘటనలపై తీసిన సినిమా.. మిస్సయిన 'సామాను' అంటూ ఓ అడల్ట్ కామెడీగా రూపొందింది.

OTT Comedy Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ అడల్ట్ కామెడీ మూవీ రాబోతోంది. ఇదొక కన్నడ సినిమా. నిజానికి థియేటర్లలో మూడేళ్ల కిందట రిలీజై ఓ మోస్తరు విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన ఓ నిజ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడంతో అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన ఘటన ఆధారంగా కామెడీ జానర్లో రూపొందిన మూవీ ఇది.
ఒందు గంటేయ కథే మూవీ ఓటీటీ
ఈ కన్నడ కామెడీ మూవీ పేరు ఒందు గంటేయ కథే. ద్వారకీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (జులై 5) నుంచి నమ్మఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సీరియస్ సబ్జెక్ట్ అయినా దానిని అడల్ట్ కామెడీగా మార్చేసి రాఘవ్ ఈ సినిమా తీశాడు. ఇందులో అజయ్ రాజ్ లీడ్ రోల్లో కనిపించాడు. అతడు ప్లేబాయ్ రాహుల్ పాత్రలో ఈ మూవీలో నటించాడు.
మూడేళ్ల కిందటే థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అడల్ట్ కామెడీ కావడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నా 'సామాను' మిస్ అయిందంటూ ఆ హీరో హల్చల్ చేస్తాడు. సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్, జోకులు ఉంటాయి. మూవీ ట్రైలర్ తోనే ఇదొక అడల్డ్ కంటెంట్ మూవీ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు.
మూడేళ్లుగా ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. మొత్తానికి జులై 5 నుంచి నమ్మఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మధ్యే ట్రిపుల్ రైడింగ్ అనే మరో కామెడీ సినిమాను కూడా ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఈ ఒందు గంటేయ కథే మూవీలో తన ప్రైవేట్ పార్ట్ కోల్పోయిన పాత్రలో నటించడానికి తాను మొదట సంకోచించానని అజయ్ రాజ్ చెప్పాడు.
అయితే ఓ నటుడిగా ఇలాంటి పాత్రను ఓ సవాలుగా తీసుకొని నటించాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా దాని గురించి మరింత మందికి తెలిసేలా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్లు చెప్పాడు.