OTT Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన జయం రవి తమిళ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ott comedy drama tamil movie brother now streaming in telugu on zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన జయం రవి తమిళ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన జయం రవి తమిళ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Hari Prasad S HT Telugu
Dec 09, 2024 03:09 PM IST

OTT Comedy Movie: ఓటీటీలోకి రీసెంట్ తమిళ కామెడీ డ్రామా మూవీ ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. పది రోజుల కిందటే తమిళంలో వచ్చిన ఈ సినిమాను తాజాగా తెలుగు ఆడియోతోనూ అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన జయం రవి తమిళ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన జయం రవి తమిళ హిట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Comedy Movie: తమిళంలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజైన మూవీ బ్రదర్. జయం రవి నటించిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. తర్వాత ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడీ మూవీ తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకే వచ్చేసింది. మరి ఈ కామెడీ డ్రామాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

yearly horoscope entry point

బ్రదర్ ఓటీటీ స్ట్రీమింగ్

జయం రవి నటించిన బ్రదర్ మూవీ నవంబర్ 29 నుంచే జీ5 (Zee5) ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే కేవలం తమిళ ఆడియోతోనే ఇన్నాళ్లూ అందుబాటులో ఉంది. తాజాగా తెలుగులోనూ ఈ సినిమాను తీసుకురావడం విశేషం.

అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అందులో చాలా వరకు నెగటివ్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చారు.

బ్రదర్ మూవీ స్టోరీ ఏంటంటే?

జయం రవి కెరీర్లో 30వ సినిమాగా ఈ బ్రదర్ తెరకెక్కింది. ఎం. రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అతని సరసన ప్రియాంకా మోహన్ నటించింది. హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అలరించినా.. మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. జయం రవి, ప్రియాంకా మోహన్ నటనకు మంచి మార్కులే పడినా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలోనే నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

లా కాలేజీని మధ్యలోనే వదిలేసి.. ప్రతి విషయంలోనూ న్యాయం కోసం ఫైట్ చేసే కార్తీక్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ బ్రదర్ మూవీ. అతని వల్ల తన పెద్దక్కతోపాటు కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంది. ఇందులో కార్తీక్ పాత్రలో జయం రవి బాగా నటించాడు. అయితే లాజిక్ పక్కన పెట్టి కేవలం నవ్వించడమే పనిగా పెట్టుకొని మూవీ తీసినట్లు అనిపిస్తుంది.

ఫ్యామిలీ క‌థ‌ల‌తో స్టార్ హీరోలు సినిమాలు చేయ‌డం లేద‌నే అప‌వాద‌ను దూరం చేయాల‌ని అనుకున్నాడు కోలీవుడ్ హీరో జ‌యం ర‌వి. ఐడియా బాగున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం బ్ర‌ద‌ర్ తేడా కొట్టేసింది. ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో క‌థ కంటే పాత్ర‌ల మ‌ధ్య‌ ఎమోష‌న్‌ను బాగా ర‌క్తిక‌ట్టాలి. ఆడియెన్స్ త‌మను తామూ క‌థ‌, పాత్ర‌ల్లో ఊహించుకునేంత‌గా డ్రామాను పండించేలా స‌న్నివేశాలు రాసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబ క‌థ‌లు వ‌ర్క‌వుట్ అవుతాయి.

బ్ర‌ద‌ర్‌లో అలాంటి మ్యాజిక్ ఎక్క‌డ క‌నిపించ‌దు. అరే ఇది భ‌లే ఉందే అని అనుకునే సీన్ ఒక్క‌టి కూడా ద‌ర్శ‌కుడు రాసుకోలేక‌పోయాడు. సినిమా మొత్తం ఆర్టిఫీషియ‌ల్ సీన్స్‌తో డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తుంది. బ్ర‌ద‌ర్ ఔట్‌డేటెట్ ఫ్యామిలీ డ్రామా మూవీ. డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పించే ఎమోష‌న్స్‌, సీన్స్‌తో ఓపిక‌కు ప‌రీక్ష‌గా నిలుస్తుంది.

Whats_app_banner