OTT Bold Web Series: తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott bold web series shweta basu prasad starring oops ab kya to stream on hotstar from 20th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Web Series: తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Bold Web Series: తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Published Feb 07, 2025 05:02 PM IST

OTT Bold Web Series: తెలుగు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ ఊప్స్ అబ్ క్యా. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కాగా.. మేకర్స్ అన్ని ఎపిసోడ్ల స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించాడు.

తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Bold Web Series: శ్వేతా బసు ప్రసాద్ తెలుసు కదా. ఒకప్పుడు కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ నటి తర్వాత ఓటీటీలో పలు బోల్డ్ క్యారెక్టర్లు చేసింది. ఇప్పుడు అలాంటిదే మరో బోల్డ్ క్యారెక్టర్ తో ఊప్స్ అబ్ క్యా (Oops Ab Kya) అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కాగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్ ట్రైలర్

శ్వేతా బసు ప్రసాద్ నటించిన వెబ్ సిరీస్ ఊప్స్ అబ్ క్యా. టైటిల్ కు తగినట్లే ఈ సిరీస్ కూడా కాస్త బోల్డ్ కంటెంట్ తోనే రాబోతోంది. ఇందులో ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నా.. అనుకోకుండా తన బాస్ వీర్యంతోనే తల్లి కాబోయే అమ్మాయి పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ నటించింది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫిబ్రవరి 20 నుంచి హాట్‌స్టార్ లో ఈ వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కానున్నాయి.

ట్రైలర్ విషయానికి వస్తే.. తన యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ కోసమంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆమెకు అనుకోకుండా మరో అమ్మాయిలోకి ఇన్సర్ట్ చేయాల్సిన వీర్యాన్ని పంపిస్తుంది ఆ డాక్టర్. దీంతో ఆమె గర్భం దాలుస్తుంది. బాయ్‌ఫ్రెండ్ ఉన్నా కూడా తన అమ్మమ్మ చెప్పిన మాటను గుర్తుకు పెట్టుకొని ఎప్పుడూ సెక్స్ చేయని తాను ఎలా తల్లిని కాబోతున్నానో మొదట ఆమెకు అర్థం కాదు.

ఆ తర్వాత జరిగిన తప్పిదాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి కూడా మరచిపోయి బాస్ తో సెక్స్ చేస్తున్నట్లు కలలు కంటుంది. అనుకోకుండానే అతనిపై మనసు పారేసుకుంటుంది. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ తో మనస్ఫర్థలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఏం చేయబోతుందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.

ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్ గురించి..

ఊప్స్ అబ్ క్యా అనే వెబ్ సిరీస్ ను ప్రేమ్ మిస్త్రీ, దేబాత్మ మండల్ డైరెక్ట్ చేశారు. డైస్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. శ్వేతా బసు ప్రసాద్ తోపాటు ఆశిమ్ గులాటి, జావెద్ జాఫ్రీ, సొనాలీ కులకర్ణి, అభయ్ మహాజన్, అపర మెహతా, అమీ ఏలా నటిస్తున్నారు. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సిరీస్ లో నటించడంపై శ్వేతా బసు స్పందించింది.

"ఊప్స్ అబ్ క్యా స్క్రిప్ట్ చదవగానే ఇది చాలా క్రేజీ రైడ్ కాబోతోందని అర్థమైంది. కొన్ని సెకన్లలోనే నా పాత్ర జీవితం పూర్తిగా తలకిందులు అవుతుంది. దీనికి కాస్త హాస్యాన్ని జోడించి తీశారు. ట్రైలర్ ఈ ప్రయాణం ఎలా ఉండబోతోంది పైపైనే చూపించింది. వెబ్ సిరీస్ చూసి ప్రేక్షకులు మరింత ఆనందిస్తారని అనుకుంటున్నాను" అని శ్వేతా బసు ప్రసాద్ అభిప్రాయపడింది.

Whats_app_banner

సంబంధిత కథనం