OTT Bold Movie: టాలీవుడ్ హీరోయిన్ బోల్డ్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Bold Movie: టాలీవుడ్ హీరోయిన్ నటించిన బోల్డ్ మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు ప్రసాద్ మరో బోల్డ్ క్యారెక్టర్ ఈ మూవీలో పోషించడం విశేషం.
OTT Bold Movie: ఓటీటీలోకి మరో బోల్డ్ మూవీ వచ్చేస్తోంది. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందన్న బోల్డ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు ఊప్స్ అబ్ క్యా (Oops Ab Kya). కొత్త బంగారులోకం మూవీతో తెలుగు వారికి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

ఊప్స్ అబ్ క్యా ఓటీటీ రిలీజ్ డేట్
సిల్వర్ స్క్రీన్ నుంచి మెల్లగా ఓటీటీలోకి వెళ్లి ఇప్పటికే కొన్ని బోల్డ్ పాత్రలు పోషించిన నటి శ్వేతా బసు ప్రసాద్. ఇప్పుడామె నటించిన ఊప్స్ అబ్ క్యా (Oops Ab Kya) మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీ ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని హాట్ స్టార్ గురువారం (జనవరి 23) ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది. "ఇది ఎగుడుదిగుడుగా సాగే రైడ్ కాబోతోంది. హాట్ స్టార్ స్పెషల్స్ ఊప్స్ అబ్ క్యా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.
బోల్డ్ కాన్సెప్ట్‌తో టీజర్
ఈ ఊప్స్ అబ్ క్యా మూవీ నుంచి వచ్చిన 50 సెకన్ల టీజర్ చూస్తేనే స్టోరీ ఏంటన్నది స్పష్టమవుతోంది. టీజర్ మొదట్లోనే ఓ అమ్మమ్మ తన మనవరాలికి మానం అనేది ఓ పిగ్గీ బ్యాంక్ లాంటిది.. ఒకసారి పగిలిందంటే మళ్లీ అతకదు అని చెబుతుంది. అయితే ఆ తర్వాత అమ్మాయే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది.
అప్పటికే ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉండటంతో ఆమె తప్పు చేసిందని ఇంట్లో వాళ్లు కూడా భావిస్తారు. అయితే తాను అలాంటి పని చేయలేదని, ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో తెలియడం లేదని ఆమె వేడుకుంటుంది. అయితే అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది.
మరో అమ్మాయికి చేయాల్సిన ఆ ప్రొసీజర్ ను తనకు చేసినట్లు చెప్పడంతో ఆమె షాక్ తింటుంది. అయితే ఈ పొరపాటును సరిదిద్దకుండా తన ప్రెగ్నెన్సీని కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం