OTT Fantasy Thriller Film: ఓటీటీలోకి వచ్చిన ఫ్యాంటసీ కామెడీ మూవీ.. గేమ్ ఆడుతూ వేరే కాలానికి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Adventure Fantasy Thriller Film: ఫ్యామిలీ ప్యాక్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. డిఫరెంట్ స్టోరీలైన్‍తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ ఫ్రెంచ్ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇవే..
ఫ్రాంక్ డుబోస్క్, జీన్ రెనో ప్రధాన పాత్రల్లో ఫ్యామిలీ ప్యాక్ చిత్రం రూపొందింది. ఈ ఫ్రెంచ్ అడ్వెంచర్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ మూవీకి ఫ్రాన్సియోస్ ఉజాన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో కాకుండా ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ పెంచిన ఈ మూవీ నేడు (అక్టోబర్ 23) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడ..
ఫ్యామిలీ ప్యాక్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఫ్రెంచ్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఫ్యామిలీ ప్యాక్ చిత్రంలో డుబోస్క్, జీన్ రెనోతో పాటు సుజానే క్లెమెంట్, లిసా డో కుటో, రఫేల్ రోమాండ్, అలిజీ కనైస్, జార్జీ ఫిటౌసీ కీలకపాత్రలు పోషించారు. ఫ్యాంటసీ ఎలిమెంట్లతో సర్వైవల్ స్టోరీగా ఈ చిత్రాన్ని ఫ్రాన్సియోస్ ఉజాన్ తెరకెక్కించారు.
ఫ్యామిలీ ప్యాక్ స్టోరీలైన్
ఓ కుటుంబంలోని సభ్యులు పాతకాలం నాటి ఓ కార్డ్ గేమ్ ఆడతారు. గేమ్ వల్ల అనుకోకుండా మధ్యయుగం నాటి కాలానికి వెళ్లిపోతారు. అక్కడ చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. తోడేళ్ల నుంచి వారికి ప్రమాదం ఎదురవుతుంది. వాటితో వారు పోరాడాల్సి వస్తుంది. వారు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? మళ్లీ ప్రస్తుత కాలానికి సురక్షితంగా రాగలిగారా? ఆ కార్డ్ గేమ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేవి ఫ్యామిలీ ప్యాక్ సినిమాలో ఉంటాయి.
ఫ్యామిలీ ప్యాక్ చిత్రాన్ని రాడార్ ఫిల్మ్స్ పతాకంపై మాథ్యూ వార్టెర్, క్లెమెంట్ మిసెరెజ్ ప్రొడ్యూజ్ చేశారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ బాటపట్టింది ఈ మూవీ. ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.
జియోసినిమా ఓటీటీలో నేడు ‘ఫ్యూరియోసా’
హాలీవుడ్ యాక్షన్ సినిమా ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ సినిమా నేడు జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, అన్య టేలర్ జాయ్ లీడ్ రోల్స్ చేశారు. ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ చిత్రం గతంలోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. అయితే, ఇప్పుడు జియో సినిమాలో రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలైంది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్కైబర్లు ఉచితంగా ఈ మూవీని చూడొచ్చు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.