OTT Action Thriller: ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott action thriller movie kill to stream on disney plus hotstar from september 6th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Action Thriller: ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 30, 2024 01:48 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి ఇండియాలోనే మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ శుక్రవారం (ఆగస్ట్ 30) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Action Thriller: ఓటీటీలోకి ఇప్పుడు ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఇండియాలో మోస్ట్ వయోలెంట్ మూవీగా మేకర్సే చెప్పుకున్న ఆ సినిమా పేరు కిల్. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీకి హిందీ బెల్ట్ లో గట్టి పోటీ ఇచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే విదేశాల్లో ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఇండియాలో మరో ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

కిల్ ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ నటీనటులు లక్ష్య, తాన్యా మాణిక్‌తలా, రాఘవ్ జుయల్ నటించిన మూవీ కిల్. అత్యంత హింసాత్మక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దీనికి పేరుంది. ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ శుక్రవారం (ఆగస్ట్ 30) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఈ ప్రయాణం మొత్తం రక్తపాతంతో నిండిపోనుంది. మేము వచ్చేస్తున్నాం. కిల్ మూవీ సెప్టెంబర్ 6 నుంచి మీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే వస్తున్నట్లు తెలిపింది. తెలుగు వెర్షన్ గురించి సమాచారం లేదు.

కిల్ మూవీ ఎలా ఉందంటే?

కిల్ మూవీ జులై 5న థియేటర్లలో రిలీజైంది. హింస చాలా ఎక్కువగా ఉన్నా.. మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే దాని ప్రభావం బాక్సాఫీస్ దగ్గర మాత్రం కనిపించలేదు.

ఈ కిల్ మూవీ అంతంతమాత్రం వసూళ్లే రాబట్టింది. నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేసిన కిల్ మూవీ.. గతేడాది వచ్చిన యానిమల్ కంటే కూడా వయోలెంట్ మూవీ అన్న రివ్యూలు వచ్చాయి. కిల్ చిత్రాన్ని ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించారు.

మొత్తం ట్రైన్‌లోనే నడిచే యాక్షన్

కిల్ సినిమా యాక్షన్ మొత్తం రైల్‍లోనే ఉంటుంది. ఈ చిత్రంలో ఎక్కువగా కత్తులతో నరుక్కునే, పొడుచుకునే సీన్లు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ సిరీస్ జాన్‍విక్ ఛాయలు ఈ మూవీలో కాస్త కనిపిస్తాయి. రణ్‍బీర్ కపూర్ హీరోగా గతేడాది వచ్చిన యానిమల్ సినిమాలో వయోలెన్స్ విపరీతంగా ఉందనే కామెంట్లు వచ్చాయి.

అయితే, ఈ కిల్ మూవీలో అంతకు మించిన హింస ఉంది. యానిమల్‍తో పోలిస్తే కథలో అంత డెప్త్ లేకపోయినా.. హింస మాత్రం కిల్‍లో ఎక్కువగా ఉంది. కెమెరా యాంగిల్స్, క్లోజప్ షాట్స్ చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఇంటెన్స్‌గా హింసను మేకర్స్ చూపించినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ కథ ఊహించే విధంగానే ఉంటుంది. ఒకటి మినహా పెద్దగా మలుపులు ఉండవు. ఫస్టాఫ్ కాసేపు సాగదీతగా అనిపించినా.. ఆ తర్వాత మూవీ వేగం పుంజుకుంటుంది.

యాక్షన్‍ను ఇష్టపడే వారికి కిల్ చిత్రం బాగా నచ్చుతుంది. ఎలాంటి పక్కదోవ పట్టకుండా యాక్షన్ ఆధారంగానే ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్‍లో కాస్త సాగదీత మినహా ఈ మూవీలో ఎక్కడా ఉత్కంఠ తగ్గదు. ప్యూర్ యాక్షన్ చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఆప్షన్.