OTT Action Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్-ott action thriller movie bagheera to stream on netflix from 21st november on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Action Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Nov 20, 2024 03:31 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హీరో మూవీ రాబోతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Action Thriller: ఓటీటీలోకి మరో హిట్ మూవీ కేవలం 20 రోజుల్లోనే రాబోతుండటం విశేషం. గత నెల 31వ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ సూపర్ హీరో మూవీ బఘీరా.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ సినిమాలో శ్రీమురళి లీడ్ రోల్లో నటించగా.. సూరి దర్శకత్వం వహించాడు.

బఘీరా ఓటీటీ రిలీజ్ డేట్

అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన బఘీరా మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. అయినా ఈ మూవీ మూడు వారాల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

బఘీరా మూవీ గురువారం (నవంబర్ 21) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, తుళు భాషల్లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే బఘీరా స్ట్రీమింగ్ మొదలవుతుంది.

బఘీరా మూవీ గురించి..

బఘీరా ఓ సూపర్ హీరో మూవీ. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలు అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించగా.. ఆ సినిమాల ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ నిర్మించాడు. శ్రీమురళీ, రుక్మిణి వసంత్, ప్రకాశ్ రాజ్, సుధా రాణి, రామచంద్రరాజు లాంటి వాళ్లు నటించారు.

కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.29 కోట్ల వరకూ వచ్చాయి.

ఓ సూపర్ హీరో కావాలనుకొని చివరికి తన తల్లి కోరిక మేరకు పోలీస్ ఆఫీసర్ అయ్యే వేదాంత్ ప్రభాకర్ (శ్రీమురళి) చుట్టూ తిరిగే కథ ఇది. ఓ పోలీసుగా తాను చేయలేని న్యాయాన్ని సూపర్ హీరోగా మారి చేయాలనుకుంటాడు. పగలు పోలీసు డ్యూటీ, రాత్రిళ్లు సూపర్ హీరోగా మారి దుండగుల భరతం పట్టడం పనిగా పెట్టుకుంటాడు.

బఘీరా ఎలా ఉందంటే?

అక్టోబ‌ర్ 31న థియేట‌ర్ల‌లో రిలీజైన బ‌ఘీర మూవీ థియేట‌ర్ల‌లో యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయ‌ంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ కథ, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేదన్న విమర్శలూ ఉన్నాయి. కేజీఎఫ్, స‌లార్ స్థాయిలో బ‌ఘీర‌లో ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో మోస్తారు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ఈ మూవీ ద‌క్కించుకుంది.

నిజానికి డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తుందని భావించారు. కానీ ఎంతో ముందుగానే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. గురువారం (నవంబర్ 21) నుంచే బఘీరా మూవీని నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Whats_app_banner