OTT Action Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి-ott action thriller dhruv sarjas martin now streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

OTT Action Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

Hari Prasad S HT Telugu
Nov 19, 2024 07:46 AM IST

OTT Action Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా వచ్చేసింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ మంగళవారం (నవంబర్ 19) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ డిజాస్టర్ సినిమా.

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

OTT Action Thriller: కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్టిన్ (Martin) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత నెల దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. ధృవ్ సర్జా లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

మార్టిన్ ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడ్ స్టార్ హీరో ధృవ్ సర్జా నటించిన మార్టిన్ మూవీ మంగళవారం (నవంబర్ 19) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న దసరా సందర్భంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళంలలోనూ ఈ మార్టిన్ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. గత నెల వేట్టయన్, విశ్వం, మా నాన్న సూపర్ హీరోలాంటి సినిమాలతో కలిసి రిలీజైన ఈ మార్టిన్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ డిజాస్టర్ మూవీ ఓటీటీలోకి రావడానికి నెల రోజులకుపైనే పట్టింది.

మార్టిన్ స్టోరీ ఏంటంటే?

మార్టిన్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఏపీ అర్జున్ డైరెక్ట్ చేశాడు. ధృవ్ సర్జాతోపాటు వైభవి శాండిల్య, అన్వేసి జైన్, సుక్రుత వాగ్లే, అచ్యుత్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజైంది. అయితే అసలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ సినిమా మొత్తం మార్టిన్, అర్జున్ అనే పాత్రల చుట్టూ తిరుగుతుంది. మార్టిన్ ఓ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్. అతని ఐడెంటిటీ ఎవరికీ తెలియదు. మరోవైపు పాకిస్థాన్ లో జరిగిన ఓ దాడిలో ఇండియన్ నేవీ ఆఫీసర్ అర్జున్ (ధృవ్ సర్జా) అక్కడి వాళ్లకు చిక్కుతాడు. అతడి జ్ఞాపకాలను చెరిపేయడానికి వాళ్లు ఓ ఇంజెక్షన్ ఇస్తారు. అతడు మెల్లగా తన గతాన్ని మరచిపోతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మార్టిన్, ఈ అర్జున్ కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

అయితే స్టోరీ, డైరెక్షన్ దారుణంగా ఉండటంతో మార్టిన్ అసలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మూవీలో డ్యుయల్ రోల్లో ధృవ్ సర్జా బాగానే నటించినా.. యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నా.. సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. మరి థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటోందో చూడాలి.

Whats_app_banner